తెలంగాణ

ముప్పు ఇంట్లోనా.. బయటా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 9: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయని, కనీసం టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో కెసిఆర్ ప్రభుత్వం ఉందని టి-టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కానీ కొత్తగా క్యాంపు కార్యాలయం పేరిట ముఖ్యమంత్రి కట్టించుకున్న నివాస భవనంలోని తన బాత్‌రూంను బుల్లెట్ ప్రూఫ్ చేయించుకున్నారని ఆరోపించారు. సాధారణంగా ఏ ముఖ్యమంత్రికైనా భద్రతాపరమైన సమస్య ఏర్పడితే కార్లను బుల్లెట్ ప్రూఫ్‌లుగా మారుస్తారని, కానీ బాత్‌రూంను బుల్లెట్‌ప్రూప్‌గా మార్చటం ఎందుకని ప్రశ్నించారు. దీనినిబట్టి ముఖ్యమంత్రికి బయటి నుంచి ప్రమాదం ఉందా, లేక ఇంట్లోనివారి నుంచి ప్రమాదం ఉందా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై చేపట్టిన విద్యార్థి పోరు రాష్టవ్య్రాప్త కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి శుక్రవారం ఇక్కడ ప్రారంభించారు. విద్యార్థుల ర్యాలీలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఆ తరువాత ఏకశిల పార్కులో జరిగిన సమావేశంలో మాట్లాడుతు అభివృద్ధి, సంక్షేమం పేరిట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా లక్షకోట్లకు పైగా అప్పులు చేసారని, దీనివల్ల రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై రెండున్నల లక్షల అప్పు భారం పడుతోందని చెప్పారు. ప్రజలపై అప్పుల భారం పడుతుంటే కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఆస్తులు పెంచుకుంటున్నారని ఆరోపించారు.
అక్రమ సంపాదనలో మేటి
తెలంగాణ ఉద్యమానికి ముందు ఆయనకు చెప్పుకోదగిన ఆస్తులు లేవని, కానీ ఉద్యమ సమయంలో, ఇప్పుడు లెక్కకు మించిన ఆస్తులు సంపాదించారని, ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రపంచంలో గొప్పగొప్ప ఉద్యమకారులుగా పేరున్న నాయకులు ఎవరికీ ఈ మేరకు ఆస్తులు లేవని అన్నారు. కెసిఆర్‌ను గొప్ప ఉద్యమకారుడిగా ఆయన పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, మరి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి, నిషాన్‌రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య వంటి వ్యక్తులను ఏమని పిలవాలని ప్రశ్నించారు. కొత్తగా నిర్మిచిన క్యాంపు ప్రారంభం సందర్భంగా కార్యాలయంలోని తన సీటులో ఆంధ్ర ప్రాంతానికి చెందిన చినజీయర్ స్వామిని కెసిఆర్ కూర్చోబెట్టడం వల్ల తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులు ఆత్మలు క్షోభిస్తున్నాయని అన్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఖాళీగా ఉన్న లక్షకుపైగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కెసిఆర్ ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీని పట్టించుకోలేదని ఆరోపించారు. కెజి టు పిజి వరకు ఉచిత విద్య అని ఉద్యమ సమయంలో, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఇంతవరకు అమలులోకి రాలేదని, పైపెచ్చు 3224 పాఠశాలలను మూసివేసేందుకు కెసిఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. విద్యార్థులకు ఇచ్చే ఫీజుల రియింబర్స్‌మెంటు అతీగతి లేకపోవటంతో విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని, విద్యాసంస్థలు మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 220 ఇంజనీరింగ్, ఫార్మా కళాశాలలు మూతపడ్డాయని అన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామకాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటంవల్ల విద్యారంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని చెప్పారు. విద్యారంగ సమస్యలు, విద్యార్థుల సమస్యలపై ఆందోళనకు పూనుకుంటే ఈ కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రయత్నిస్తున్నారని, ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినా రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాలలో పర్యటించి విద్యార్థుల సమస్యలపై ఆందోళనలు చేపడతానని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం..విద్యార్థిపోరు కార్యక్రమంలో మాట్లాడుతున్న టిటిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి