తెలంగాణ

వేదిక మారిస్తే వాదన వినిపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రీసెర్చి స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య, వర్శిటీలో పరిణామాలపై కేంద్రం నియమించిన ఏకసభ్య కమిషన్ జస్టిస్ అశోక్ కుమార్ రూపన్‌వాలా బుధవారం నాంపల్లి గోల్డెన్ థ్రెషోల్డ్ దూర విద్యా కేంద్రం (సిడివిఎల్)లో విచారణ కొనసాగించారు. బుధవారం ఉదయం చీఫ్ ప్రోక్టార్, చీఫ్ వార్డెన్, వార్డెన్‌లు, డీన్, సమానావకాశాల సెల్ అధికారుల నుండి వాంగ్మూలాలను నమోదు చేశారు. సాయంత్రం స్టూడెంట్స్ గ్రీవెన్స్ సెల్, ర్యాగింగ్ సెల్ ప్రతినిధులు సైతం హాజరై తమ అభిప్రాయాలను వివరించారు. 25 ఉదయం విసి ప్రొఫెసర్ అప్పారావు, తాత్కాలిక విసి ఫ్రొఫెసర్ ఎం పెరియసామి, రిజిస్ట్రార్ సుధాకర్, ఇతర సీనియర్ అధికారులు తమ వాంగ్మూలాలు ఇవ్వనున్నారు. విచారణ వేదికను మార్చి వర్శిటీలోనే కొనసాగిస్తే తాము స్వేచ్ఛగా అభిప్రాయాలను చెప్పగలుగుతామని అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు కమిషన్‌కు ఏకరువు పెట్టారు. వర్శిటీకి దూరంగా విచారణ నిర్వహించడం వల్ల తాము అక్కడికి హాజరై అభిప్రాయాలు చెప్పలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ర్యాలీల్లో పాల్గొనేందుకు తమ సంఘం సభ్యులు అంతా వెళ్లిన సమయంలో న్యాయవిచారణ వల్ల తమకు జరిగే ప్రయోజనం ఏమీ ఉండబోదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.