జాతీయ వార్తలు

25 నుంచి మెరుగైన యుఎస్‌ఎస్‌డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: పెద్ద నోట్ల రద్దు వలన దేశ వ్యాప్తంగా నగదు కొరత తీవ్రస్థాయిలో కొనసాగుతున్నందున నగదు రహిత చెల్లింపుల కోసం ఈ నెల 25వ తేదీ నుంచి వినియోగదారులకు మరింత అనుకూలమైన యుఎస్‌ఎస్‌డి (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా) వెర్షన్‌ను లేదా ఫీచర్ మొబైల్ ఫోన్లతో చెల్లింపులకు జరిపేందుకు ఉపయోగించే *99అ సేవను అందుబాటులోకి తీసుకురావాలని డిజిటల్ చెల్లింపులపై ముఖ్యమంత్రులతో ఏర్పాటైన కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రజలకు మరింత విస్తృతంగా డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకురావడం ఎలా? అనే విషయంపై దృష్టి సారించేందుకు ఏపి సిఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పాటైన ఈ కమిటీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కొన్ని సిఫారసులను సమర్పించింది. డిసెంబర్ 25వ తేదీ నుంచి మరింత మెరుగైన (అప్‌గ్రేడెడ్) యుఎస్‌ఎస్‌డి వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఆధార్‌ను ఉపయోగించడం ద్వారా కెవైసి (నో యువర్ కస్టమర్)ని సరళీకృతం చేసేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా ఈ కమిటీ సూచించిందని శనివారం విడుదలైన ఒక అధికారిక ప్రకటన వెల్లడించింది. ఈ కమిటీ రెండవ సమావేశం నీతి ఆయోగ్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ప్రధాన బ్యాంకుల సిఎండిలతో గురువారం ముంబయిలో చంద్రబాబు నాయుడు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా, రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్‌బిఐ ఉన్నతాధికారులు చర్చలు జరిపిన అనంతరం ఈ సమావేశం జరిగింది.