జాతీయ వార్తలు

విధానాల రూపకల్పనలో బాలల హక్కులకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ప్రతికూల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న బాలల పురోగతికి ఉన్న ఆటంకాలను తొలగించాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. ప్రభుత్వం రూపొందించిన విధానాల కార్యాచరణ ద్వారా వారికి సమాన అవకాశాలను కల్పించాలని అన్నారు. రాష్టప్రతి భవన్‌లో తొలిసారి శనివారం నిర్వహించిన ‘లారేట్స్ అండ్ లీడర్స్ ఫర్ చిల్డ్రన్ సమ్మిట్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ అన్ని చోట్లా బాలల హక్కుల అమలు, పరిరక్షణ అనే బృహత్ లక్ష్య సాధన కోసం ప్రభుత్వం సహా ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఉద్బోధించారు. ‘జాతీయ స్థాయిలో విధానాల రూపకల్పనలో బాలలకు సంబంధించిన కార్యక్రమాలు, చర్యలు కేంద్ర స్థానాన్ని ఆక్రమించాలని రాష్టప్రతి అన్నారు. ఇతర వయస్సుల గ్రూపుల కన్నా ఎక్కువగా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న బాలలకు ఆటంకంగా ఉన్న అసమానతలను తగ్గించవలసిన ఉమ్మడి బాధ్యత మనపై ఉందని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు’ అని రాష్టప్రతి భవన్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ‘ప్రాధాన్యతల ద్వారానే సమాన అవకాశాలతో కూడిన భవిష్యత్ దిశగా పయనం సాధ్యమవుతుంది. విద్య, ఆరోగ్యం, పేదరికం సూచీల్లో వ్యత్యాసాలను రూపుమాపవలసి ఉంది’ అని రాష్టప్రతి అన్నారు. మన బాలల అభివృద్ధి, భద్రతతో పాటు వారికి సమాన అవకాశాలను కల్పించవలసిన నైతిక బాధ్యత మనపై ఉందని ఆయన అన్నారు. ‘ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో బాలలకు విద్య అందుబాటులో లేదు. వారు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతూ నివారించగలిగిన వ్యాధుల బారిన పడుతున్నారు. యునిసెఫ్ గణాంకాల ప్రకారం దక్షిణాసియా, సబ్-సహరాన్ ఆఫ్రికాలో 80 శాతం బాలల మరణాలు సంభవిస్తున్నాయి’ అని రాష్టప్రతి అన్నారు. నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థికి చెందిన స్వచ్ఛంద సంస్థ చిల్డ్రన్ ఫౌండేషన్ ఈ రెండు రోజుల సదస్సును నిర్వహిస్తోంది. టిబెట్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా తదితరులు ఈ సదస్సులో ప్రసంగించారు.
chitram...
రాష్టప్రతి భవన్‌లో విద్యార్థులకు
సైకిళ్లు ప్రదానం చేస్తున్న ప్రణబ్ ముఖర్జీ