తెలంగాణ

ఈసారి అధికారం మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ రాష్ట్రంలో 2019లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్టశ్రాఖ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లాలో బిజెపి జెండా ఎగురవేద్దామని అన్నారు. పూర్వం వరంగల్ జిల్లాల్లో 3ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయని 2019లో ఈ మూడు ఎస్టీ నియోజకవర్గాలలో కాషాయ జెండా ఎగురవేయాలని అన్నారు. మహబూబాబాద్ జిల్లాకు తొలిసారిగా జిల్లా అధ్యక్ష పదవి ఆదివాసీ అయిన యాప సీతయ్యకు ఇచ్చామన్నారు. ఎ ఇతర పార్టీ కూడా ఇంతవరకు గిరిజనుడికి పదవులు జిల్లా పదవులు ఇవ్వలేదన్నారు. కేంద్రప్రభుత్వంలో ప్రధానిగా రెండున్నర సంవత్సరాలు మోదీ పాలన పూర్తి అయిందన్నారు. గత పాలకులు వేలకోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారన్నారు. మోదీ వచ్చిన తర్వాత అవీనితి పాలన మచ్చుకైనా కనిపించడంలేదన్నారు. మోదీ ప్రభుత్వంలో గిరిజనులకు, ఆదివాసీలకు సామాన్యన్యాయం జరిగేలా మోదీ ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ఉజ్వల పథకం విజయవంతంమైందన్నారు. మోదీ వచ్చిన తర్వాత ఆయా రాష్ట్రాలలో అనేక సంక్షేమ పథకాలు విజయవంతం అయ్యాయన్నారు. గ్యాస్ సబ్సీడిని బడావ్యాపారులు వదిలేయలని చెప్పడంతో దానికి అనుగుణంగా సబ్సీడిని లక్షల రూపాయలను వదిలివేశారని తెలిపారు. కాంగ్రెస్ పాలన అవినీతి పాలన అన్నారు. మోదీ ప్రభుత్వంలో ఉచితంగా అందరికి జన్‌ధన్ ఖాతాలను తెరిచిందన్నారు. రూ.25కోట్ల మందికి అకౌంట్లను ఇచ్చిన ఘనత తమకే దక్కిందన్నారు. వివిధ సంక్షేమ పథకాల నిమిత్తం కేంద్రం వేలాది కోట్ల రూపాయలు పంపిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రజలకు చేరనివ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి జంగారెడ్డి, కీర్తిరెడ్డి, అశోక్‌రెడ్డి, సోమయ్య, బిక్కునాయక్, ఉపేందర్, అంజయ్య, రాఘవులు, శ్యాంశర్మ, మురళి, రాధాబాయిపటేల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మణ్