తెలంగాణ

నా కుమారుడు అమాయకుడు .. రాజకీయ కక్షతో తప్పుడు కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజకీయ కక్షతోనే తన కుమారుడిపై సిబిఐ కేసు నమోదు చేసిందని మాజీ మంత్రి, సిబిఐ మాజీ డైరెక్టర్, టిఆర్‌ఎస్ నేత కె.విజయరామారావు ఆరోపించారు. త్వరలోనే వాస్తవాలను కోర్టు ముందుంచి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటామని ఆయన తెలిపారు. బుధవారం నాడిక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తన కుమారుడిపై సిబిఐ కేసు నమోదు చేసిన మాట వాస్తవమేనని అన్నారు. అయితే ఆ కేసుతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని, అతను అమాయకుడని తెలిపారు. తప్పుడు పత్రాలతో బ్యాంకులను మోసం చేసి రూ.304 కోట్ల రుణం పొందారన్న ఆరోపణలపై బెంగళూరు సిబిఐ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విజయరామారావు మాట్లాడుతూ ప్రస్తుతానికి ఎవరి పేర్లు బయటపెట్టనని, అవసరమైనప్పుడు అందరి వివరాలను బహిర్గతం చేస్తానని చెప్పారు. కేంద్రమంత్రి సుజనా చౌదరిపై విజయరామారావు కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. విజయరామారావు తెలుగుదేశం పార్టీని వీడడం వల్లే కక్ష సాధింపుగా ఈ కేసును కుట్రపూరితంగా నమోదు చేశారని అన్నారు.

‘కార్పొరేషన్’లో ఎవరిదారి వారిదే

వరంగల్, ఖమ్మంలలో
పొత్తు పెట్టుకోని టిడిపి, బిజెపి
భవిష్యత్తులోనూ పొత్తు వద్దంటున్న
ద్వితీయ శ్రేణి నాయకులు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 22: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో మిత్రపక్షాలైన తెలుగు దేశం, బిజెపి పొత్తు లేకుండా పోటీకి దిగాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఎదురైన అనుభవం దృష్ట్యా రెండు పార్టీల రాష్ట్ర నాయకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్ధల ఎన్నికల పొత్తుల విషయంలో తాము జోక్యం చేసుకోమని, పార్టీ రాష్ట్ర నాయకత్వాల ఇష్టానికే వదిలి వేస్తున్నామని పార్టీ జాతీయ నాయకత్వం ఇదివరకే స్పష్టం చేసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి-బిజెపిలు కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాజాగా లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగినా మిత్రపక్షాలుగా ఏకాభిప్రాయంతో ఒక అభ్యర్థినే నిలబెట్టాయి. తాజాగా జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. అయితే ఇరు పార్టీలూ ఆశించిన ఫలితాలు సాధించుకోలేకపోయాయి. కలిసి ప్రచారం చేసినా, కలిసి నిజాం కళాశాలలో బహిరంగ సభ నిర్వహించినా ఓటర్లను ఆకట్టుకోలేక చతికిలబడ్డాయి. రెండు పార్టీల రాష్ట్ర నాయకుల మధ్య పొత్తు, ఏకాభిప్రాయం, అంగీకారం కుదిరినా, ద్వితీయ శ్రేణి నాయకులు, కింది స్థాయి నాయకులకు ఇది రుచించలేదు. ఎవరూ ఉత్సాహంగా పని చేయలేదు. సీట్ల సర్దుబాటు విషయంలోనూ ఎన్నో భేదాభిప్రాయాలు తలెత్తాయి. సుమారు డజను స్థానాల్లో ఏకాభిప్రాయం కుదరక చివరకు రెండు పార్టీలూ తమ అభ్యర్థులను నిలబెట్టాయి. గందరగోళం నెలకొంది.
పొత్తు వల్ల ద్వితీయ శ్రేణి నాయకులు సహకరించలేదనేది స్పష్టమైంది. తమకు బలంగా ఉన్న సీట్లను వదులుకోవాల్సి వచ్చిందనే భావన రెండు పార్టీల నేతల్లోనూ వ్యక్తమైంది. వీటన్నింటి కారణంగా పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు సరిగ్గా పని చేయలేదని, పైగా కార్యకర్తల సహకారం లభించలేదని ఇరు పార్టీల రాష్ట్ర నాయకులు భావించారు. కాబట్టి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తప్ప స్థానిక సంస్ధల ఎన్నికల్లో బలమైన సీట్లలో పొత్తు లేకుండా పోటీ చేసుకోవడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే ఎక్కడైనా బిజెపి లేదా టిడిపి అభ్యర్థి పోటీ చేయకపోతే ఆ స్థానంలో మిత్రపక్షం సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. పొత్తు లేకుండా పోటీ చేస్తున్నందున ఫలితాలు ఎలా ఉంటాయోనన్న అనుమానమూ ఆ పార్టీ నేతలకు లేకపోలేదు.

సాగునీటికి పెద్దపీట!

భారీగా నిధుల కేటాయింపునకు
తెలంగాణ సర్కారు కసరత్తు
పాలమూరుకు రూ.8046 కోట్లు..
ప్రాణహితకు రూ.7400 కోట్లు?

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 24: తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ పట్టనుంది. వచ్చే ఏడాది బడ్జెట్‌లో భారీ ఎత్తున నిధులు కేటాయించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సమక్షంలో కసరత్తు సాగుతోంది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వీలైనంత వేగంగా చేపట్టేందుకు నిధులు కేటాయించే దిశగా ఆర్ధిక, సాగునీటి శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. కెసిఆర్ కలల ప్రాజెక్టుగా ముద్రపడిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల స్కీంకు దాదాపు రూ. 8046 కోట్ల నిధులను కేటాయించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుపై విపక్షాలు చేస్తున్న విమర్శలను పక్కనపెట్టి ప్రతిష్టాకరంగా చేపట్టి పూర్తి చేయాలనే సంకల్పంతో కెసిఆర్ ఉన్నారని భారీసాగునీటిపారుదల ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగడుగునా కల్పిస్తున్న ఆవరోధాలను సైతం పక్కనపెట్టి ముందుకు వెళ్లాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. మరో మెగా ప్రాజెక్టు ప్రాణహిత ఎత్తిపోతల పథకానికి 2016-17 సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.7400 కోట్లను కేటాయించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం వల్ల ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం చేయడమే కాకుండా, మంచినీటి సమస్యను నివారించే పట్టుదలతో ప్రభుత్వం ఉంది.
తెలంగాణలో చిన్న చెరువుల అభివృద్ధికి, మరమ్మత్తుకు, మంచి నీటి సరఫరా నిమిత్తం రూ. 2264 కోట్లను కేటాయించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయం దాదాపు 65 వేల కోట్ల వరకు ఉంటుందని సమాచారం. వరద కాల్వ పథకానికి రూ.505 కోట్లు, శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ ప్రాజెక్టుకు రూ.1456 కోట్లు, సీతారాములు ప్రాజెక్టుకు రూ. 400 కోట్లు, దేవాదుల ఎత్తిపోతలకు రూ.805 కోట్లు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు రూ.400 కోట్లు, నిజాంసాగర్‌కు రూ.175 కోట్లు, కాంతనపల్లికి రూ. 200 కోట్లు, పెన్‌గంగా ప్రాజెక్టుకు రూ.125 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం.
కృష్ణా నది మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, గోదావరి నదిపై నిర్మిస్తున్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా ఇతోధికంగా నిధులు కేటాయించేందుకు సాగునీటి శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. నెట్టెంపాడుకు రూ.185 కోట్లు, బీమా ప్రాజెక్టుకు రూ.125 కోట్లు, ఎల్లంపల్లికి రూ.405 కోట్లు, కల్వకుర్తికి రూ.325 కోట్లు కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ నిమిత్తం రూ.5500 కోట్లను కేటాయించేందుకు ఆర్ధిక, రెవెన్యూ, సాగునీటి శాఖలు ప్రతిపాదనలు పంపారు.

అక్రమ రవాణాపై నిఘా

ఆర్టీసీ ఆదాయాన్ని గండికొట్టే
ప్రైవేటు వాహనాలపై ఉక్కుపాదం
అధికారులను ఆదేశించిన
తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 24: ఆర్టీసి ఆదాయానికి గండి కొడుతున్న ప్రైవేట్ వాహనాలపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే కర్నాటక, మహారాష్టల్ర నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాలని మంత్రి ఆదేశించారు. బడ్జెట్‌లో రవాణాశాఖ ప్రతిపాదనలపై బుధవారం రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, కమిషనర్ సందీప్ సుల్తానియా, జాయింట్ కమిషనర్ వెంకటేశం, పాండురంగారావు, రఘునాథ్ తదితర ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. రవాణాశాఖ ద్వారా ఈ ఏడాది రూ.2125.51 వేల కోట్ల రాబడి రావాల్సి ఉండగా ఇందులో ఇప్పటి వరకు 90 శాతం రూ.1925 కోట్లు వసూలు అయినట్టు అధికారులు వివరించారు. అయితే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఆశించిన మేరకు పనితీరు లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. రవాణాశాఖ సేవలను మెరుగు పర్చడానికి రెండు నెలల్లో మొబైల్‌లో ఎం వాలెట్ అప్లికేషన్‌ను రూపొందించి వాటి ద్వారానే లైసెన్స్‌లు, ఆర్సీ, పొల్యూషన్, బీమా తదితర సేవలను ఆన్‌లైన్లో మొబైల్ ద్వారా పొందు పర్చి పొందే అవకాశాన్ని కల్పించబోతున్నట్టు మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో రవాణాశాఖ కార్యాలయాలను ఈ-ఆఫీసులుగా మార్చబోతున్నట్టు మంత్రి వివరించారు. రాష్ట్రంలో 49 రవాణాశాఖ కార్యాలయాలు ఉండగా అందులో కేవలం 12 కార్యాలయాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లల్లో అన్ని కార్యాలయాలకు సొంత భవనాలను నిర్మించుకుంటామన్నారు. రవాణాశాఖ రికార్డులను డిజిటలైజేషన్ చేయడానికి రూ. 9 కోట్లు కేటాయించబోతున్నట్టు మంత్రి చెప్పారు. వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించి కొత్త బస్సులు కొనుగోలు చేస్తామని మంత్రి చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేయబోతున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.

బుధవారం సచివాలయంలో రవాణాశాఖ అధికారులతో
సమీక్షిస్తున్న తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి