తెలంగాణ

రేపటి నుంచి నిజాంసాగర్ నీటి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ, డిసెంబర్ 12: ప్రస్తుత యాసంగి పంటల సాగు కోసం ఈ నెల 14వ తేదీ నుండి నిజాంసాగర్ ద్వారా నీటిని విడుదల చేయనున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశంలో ఈ నెల 1వ తేదీ నుండే నీటిని విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ, రైతుల అభ్యర్థన మేరకు రెండు వారాలు ఆలస్యంగా నీటి విడుదలకు చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. సోమవారం బాన్సువాడలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి పోచారం మాట్లాడుతూ, 14వ తేదీన ఉదయం 6.50గంటలకు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే నిజాంసాగర్ నుండి ప్రధాన కాల్వకు నీటి విడుదలను ప్రారంభిస్తారని వివరించారు. అయితే అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలతో పాటు లక్ష్మి కెనాల్, ఇతర జలాశయాల నుండి మాత్రం డిఐబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే సంబంధిత తేదీలలో నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుత యాసంగిలో ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో మూడు లక్షల పైచిలుకు ఎకరాల్లో వరి, చెరకు పంటలను సాగు చేయనున్నారని, నాన్‌కమాండ్ ఏరియాల కింద మరో 54వేల ఎకరాల విస్తీర్ణంలో పంటల సాగు చేపడతారని అంచనా వేస్తున్నామని మంత్రి పోచారం తెలిపారు.
యాసంగి పంట సాగు కోసం నిజాంసాగర్ నుండి 9.19 టిఎంసిలు, అలీసాగర్, గుత్పల ద్వారా 2 టిఎంసిలు, నిజామాబాద్, బోధన్ పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం 2 టిఎంసిల నీటిని కేటాయించామన్నారు. మిగతా 3.7 టిఎంసిల నీటిని నిజాంసాగర్‌లో నిల్వ ఉంచుతామని, వచ్చే ఏడాది జూన్ మొదటి వారంలో ఖరీఫ్ పంటల సాగు కోసం రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకునేలా నీటిని అందిస్తామని మంత్రి పోచారం పేర్కొన్నారు. దీంతో పాటు సింగూర్ నుండి ఉమ్మడి జిల్లాలకు వాటాగా రావాల్సిన మరో 9టిఎంసిల నీటిని నిజాంసాగర్‌లోకి మళ్లించుకుంటామని అన్నారు.