తెలంగాణ

మేడ్చల్‌లో దోపిడీ దొంగల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, డిసెంబర్ 12: మేడ్చల్ మండలం అత్వెల్లి-ఎల్లంపేట్ 44వ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భారత్ పెట్రోలియం బంకులో ఆదివారం అర్ధరాత్రి బందిపోటు దొంగలు బీభత్సం సృష్టించారు. పెట్రోల్ బంకు సిబ్బందిని తుపాకీతో బెదిరించి కత్తులతో దాడి చేశారు. లాకర్‌ను బద్దలు కొట్టి సుమారు రూ.23 లక్షల నగదును, సిసి కెమెరాలను అపహరించి పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకాం.. ఆదివారం అర్ధరాత్రి గం. 2.00 నుంచి 2.30ల మధ్య ఆరుగురు వ్యక్తులు ముఖాలకు మంకీ క్యాప్‌లు ధరించి బంకు క్యాబిన్‌లోకి చొరబడ్డారు. ఆ సమయంలో క్యాబిన్ సూపర్‌వైజర్ సంజీవరెడ్డితో పాటు సిబ్బంది బాలసాయి, శ్రావణ్‌కుమార్, రవికుమార్‌తో పాటు సెక్యూరిటీ గార్డు ధన్‌రాజ్ కూర్చుని ఉన్నారు. క్యాబిన్ బయట బంకు వద్ద లింగారెడ్డి అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడు. క్యాబిన్‌లోకి చొరబడిన ఆరుగురు బందిపోటు దొంగలు లోపలికి వస్తూనే సూపర్‌వైజర్ సంజీవరెడ్డి తలకు తుపాకీ గురిపెట్టి బంకు వద్ద విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని లోపలికి పిలువాలని ఆదేశించారు. దీంతో భయబ్రాంతులకు గురైన సంజీవరెడ్డి, బంకు వద్ద లింగారెడ్డిని లోపలికి రమ్మని పిలిచాడు. అనంతరం బందిపోటు దొంగలు సూపర్‌వైజర్‌తో పాటు సిబ్బందిపై ఇష్టానుసారంగా కత్తులతో దాడి చేశారు. కాళ్లు చేతులు ముఖంపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి భయబ్రాంతులకు గురిచేశారు. డబ్బులు భద్రపరిచిన లాకర్ తాళాలు ఇవ్వాలంటూ బెదిరించారు. బంకు సిబ్బంది తాళాలు తమ వద్ద లేవని కొద్ది సేపు బుకాయించినప్పటికీ సంజీవరెడ్డి తలకు తుపాకీ గురిపెట్టి బెదిరించడంతో భయపడి లాకర్ తాళాలను దొంగలకు అప్పగించారు. బంకు సిబ్బంది ఉపయోగించే స్పోర్ట్స్ కిట్ బ్యాగ్‌లోనే లాకర్‌లో భద్రపరిచిన రూ.22,97,306 రూపాయలను దొంగలు సర్దుకున్నారు. ఈ క్రమంలో దొంగలు క్యాబిన్‌లోని ఎలక్ట్రానిక్స్ వస్తువులను ధ్వంసం చేశారు. సిబ్బంది వద్ద గల ఫోన్‌లను లాక్కుని పగులగొట్టారు. క్యాబిన్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పది నుండి 15 నిమిషాలలో తతంగమంతా ముగించుకుని నగదుతో ఉడాయించారు. వెళుతూ, వెళుతూ క్యాబిన్ నుండి ఎవరైనా బయటకి వస్తే ప్రాణాలు తీస్తామని బెదిరించడంతో బంకు సిబ్బంది ఎవరూ బయటికి రాలేదు. సిబ్బందికి ఈ షాక్ నుంచి తేరుకునేందుకు అర గంట పట్టింది. దుండగుల దాడిలో గాయపడ్డ సెక్యూరిటీ గార్డు ధన్‌రాజ్ వద్ద మరో ఫోన్ ఉండగా దానితో సమాచారాన్ని బయటకు చేరవేశారు. సమాచారం అందుకున్న మేడ్చల్ ఇన్స్‌పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. బందిపోటు దొంగలు ఎలా వచ్చింది.. ఎలా వెళ్లింది.. తమకు అర్థం కాలేదని, చూడలేదని.. అంతా సినీ ఫక్కీలో జరిగిపోయిందని బంక్ సిబ్బంది పోలీసులకు పేర్కొన్నారు. బందిపోటు దొంగలు తెలుగులో కాకుండా ఇతర భాషలలో మాట్లాడారని, ముఖాలకు మంకీ క్యాప్‌లు ధరించారని వివరించారు. దొంగల దాడిలో గాయపడిన సిబ్బందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా సోమవారం తెల్లవారుజామున సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థిని సమీక్షించారు. దొంగతనం జరిగిన తీరును తెలుసుకున్నారు. అప్పటికే పేట్‌బషీరాబాద్ డివిజన్ ఏసిపి అశోక్‌కుమార్ గౌడ్ బాలానగర్ జోన్ డిసిపి సాయిశేఖర్ మేడ్చల్ సిఐ రాజశేఖర్‌రెడ్డి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను, డాగ్‌స్క్వాడ్‌ను కూడా రప్పించారు. పోలీసు జాగిలాలు మేడ్చల్ హైవే వరకు వెళ్లి అగిపోయాయి.
2008లోనూ ఇదే నెలలో దోపిడీ
ఆదివారం అర్థరాత్రి మేడ్చల్‌లో పెట్రోల్ బంకుపై జరిగిన దాడి తరహలోనే 2008 డిసెంబర్‌లో కూడా ఇలాంటి దోపిడీ జరిగింది. నలుగురు బందిపోటు దొంగలు టాటా సుమోలో వచ్చి బంకు సిబ్బందిపై తుపాకులతో కాల్పులు జరిపి దొంగతనానికి పాల్పడ్డారు. కాల్పుల్లో బంకు సిబ్బంది ఇద్దరు తీవ్రం గా గాయపడ్డారు. మళ్లీ అదే బంకులో ఇదే తరహాలో దోపిడీ జరుగడం గమన్హారం.
తొలుత రెక్కీ.. ఆ తర్వాత దోపిడీ
బందిపోటు దొంగలు బంకులో బీభత్సం సృష్టించి నగదును అపహరించేందుకు పక్కా ప్రణాళికతో రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంకు కంపెనీ అవుట్‌లెట్ కావడం.. బ్యాంకులకు కూడా వరుసగా మూడు రోజులు సెలవు రాడం.. డబ్బును బంకు సిబ్బంది క్యాబిన్‌లోని లాకర్‌లోనే భద్రపరచడాన్ని చూస్తే దుండగులు పక్కా ప్లాన్ ప్రకారమే బంకుపై దాడికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.
రంగంలోకి మూడు ప్రత్యేక బృందాలు
దొంగల ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలను పోలీసులు రంగలోకి దింపారు. ప్రత్యేక బృందాలు ఇప్పటికే పలు కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలిసింది. దొంగతనం జరిగిన సమయానికి ముందు తర్వాత మేడ్చల్ హైవేపై రాకపోకలు సాగించిన ప్రతీ వాహనం వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. హైవేపై ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సిసి కెమోరాల ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బందిపోటు దొంగలు బంకు వద్ద ఎటువంటి అనవాలు వదులకపోవడంతో పోలీసు యంత్రాగం తీవ్ర స్థాయిలో శ్రమిస్తోంది. కాగా భారత్ పెట్రోల్ బంకు వద్ద బందిపోటు దొంగలు సృష్టించిన బీభత్సం సంఘటన సోమవారం ఉదయం మేడ్చల్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది. ఓ వైపు పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతుండగా అపహరణకు గురైన నగదు కొత్త నోట్లా.. పాత నోట్లా అని పలువురు ఆరా తీయడం కొసమెరుపు.

చిత్రాలు..దొంగలు బద్దలు కొట్టిన లాకర్* డివిఆర్‌ను
ఎత్తుకెళ్లడానికి ధ్వంసం చేసిన సిసి కెమెరాలు రికార్డయ్యే సిస్టం * బందిపోటు దొంగల చేతిలో
గాయపడిన వ్యక్తి