తెలంగాణ

బండారి లేఔట్‌లో ఆక్రమణల కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల/ హైదరాబాద్, డిసెంబర్ 13: మేడ్చల్ జిల్లా నిజాంపేటలోని బండారి లేఔట్‌లో అక్రమ నిర్మాణాలను హెచ్‌ఎండిఎ ఆధ్వర్యంలో కూల్చివేశారు. కాలనీలోని అక్రమంగా నిర్మించిన ఎనిమిది అపార్టుమెంట్ల గోడలను, పదిహేను విల్లాల గోడలను కూల్చివేశారు. హెచ్‌ఎండిఎ జోనల్ అధికారి ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సహకారంతో కూల్చివేతలను చేపట్టారు.
అక్రమ నిర్మాణాలపై హెచ్‌ఎండిఏ ఉక్కుపాదం
నగర శివార్లలో అక్రమ నిర్మాణాలపై హెచ్‌ఎండిఏ ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ లేఅవుట్లలో అనుమతి లేకుండా, అనుమతికి విరుద్ధంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాల కూల్చివేతలు మంగళవారం కొనసాగాయి. ముందుగా నోటీసులు జారీ చేసి పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలను చేపట్టారు. పటాన్‌చెరు, కిష్టారెడ్డిపేట, కేతిరెడ్డిపల్లి, మొయినాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్, ఘట్‌కేసర్ మండలం పరిధిలోని పోచారం, కొర్రెముల, బడంగ్‌పేట్, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలలో కూల్చివేతలు జరిగాయని హెచ్‌ఎండిఏ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిఎస్‌పి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. స్థానిక పంచాయతీ అధికారులు సైతం కూల్చివేతలో పాల్గొన్నారు.

చిత్రం..హైదరాబాద్ నగర శివార్లలో మంగళవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హెచ్‌ఎండిఏ సిబ్బంది