తెలంగాణ

సిఎంను చంపుతామని ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను చంపుతామని మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్ జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఫోన్‌కు కాల్ వచ్చింది. ఈ సమయంలో కోరుట్ల ఎస్సై బాబూరావు ఎమ్మెల్యే పక్కనే ఉండడంతో ఆ ఫోన్‌ను ఎస్సైకి ఇచ్చారు. దీంతో ఎస్సై ఆ ఫోన్‌లోనే మాటలను పొడిగించే ప్రయత్నం చేయడంతో పరుషపదజాలంతో దూషించడంతో ఎస్సై ఫోన్ కట్ చేశారు. అయతే, ఈ ఫోన్‌కాల్‌పై పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై రహస్యంగా రంగంలోకి దిగింది. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ ఫోన్‌కాల్ వ్యవహారాన్ని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై సిఎం కెసిఆర్ పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఫోన్ కాలర్‌ను పట్టుకోవడం కోసం సాంకేతిక ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాగా, ఎవరో ఆకతాయి పని అయ ఉంటుందని తేలికగా తీసుకోకుండా త్వరలోనే నెట్ సెంటర్ వివరాలతోపాటు ఫోన్‌కాలర్‌ను పట్టుకుంటామని పోలీస్ అధికారులు తెలిపారు. కాగా, హైదరాబాద్‌లోని ఓ నెట్ సెంటర్ నుండి ఈ ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

నల్గొండ - మాచర్ల రైల్వేలైన్ పూర్తిచేయండి: గుత్తా
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: నల్గొండ-మాచర్ల రైల్వేలైన్ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కేంద్ర రేల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభుని కోరారు. ఈ ప్రాజెక్టు కొరకు 1997-98లోనే రూ.458కోట్ల అంచనా వేశారని, ఈ ప్రాజెక్టుకు ఎక్కువ నిధులు విడుదల చేయాలని మంత్రిని కోరినట్లు గుత్తా తెలిపారు. రెండు రాష్ట్రాలకే కాకుండా వెనకబడిన నల్గొండకు కూడా ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని లేఖలో పేర్కొన్నారు.

నియోజకవర్గాల
పునర్విభజన ఖాయం

కరవు నివారణకు సిద్ధం కావాలి నిధుల ప్రత్యామ్నాయ మార్గం చూద్దాం
ప్రజలకు నీటి ఇబ్బంది లేకుండా చూడాలి సమీక్షలో సిఎం కెసిఆర్

జగిత్యాల, ఫిబ్రవరి 24: రాష్ట్రంలో నియోజక వర్గాల పునర్విభజన ఖచ్చితంగా జరిగి తీరుతుందని ఇందులో గ్రామాలు, మండలాలు తారుమారు అవుతాయని, ఓ పద్ధతి ప్రకారం విభజన జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో బుధవారం జరిగిన పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ సోదరి వివాహానికి హాజరైన అనంతరం కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు నివాసంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో కరవు నివారణ చర్యలు, ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలు, పలు అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు ఎదుర్కొనేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు సంసిద్ధంగా ఉండాలని, ప్రభుత్వంలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడకుండా ఇప్పటినుండే అధికారులతో చర్చించి వేసవికాలం గడిచే వరకు ప్రత్యామ్నాయ మార్గాలను చూద్దామన్నారు. ఇదిలావుండగా, రానున్న జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నియోజకవర్గానికి పది మంది ఆయా రంగాల్లో రాణించిన మహిళలను గుర్తించి నివేదికలు పంపించాలని, వారికి అదేరోజు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమతో చర్చించి ఆయా రంగాల్లో ప్రతిభావంతులైన మహిళలకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు సిఎం కెసిఆర్ వెల్లడించారు. ఇప్పుడే ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, రాజకీయ ఆశావహులు ఎలాంటి ఊహలు పెంచుకోవద్దని నియోజక వర్గాల విభజన తరువాతనే రాజకీయ సమీకరణలు ఉంటాయని భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నియోజక వర్గాల విభజన జరుగుతుందన్నారు. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత, కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, గంగుల కమలాకర్, పుట్ట మధు, బొడిగె శోభ, సోమారపు సత్యనారాయణ, రేఖాశ్యాంనాయక్, దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎండుతున్న గొంతులు

బోరుమంటున్న జలాశయాలు
పాలమూరు జిల్లాలో తాగునీటికి కటకట
పాలకులు మేల్కొనకుంటే అనర్థమే
అడుగుతేలిన రామన్‌పాడు జలాశయం
బీటలువారిన కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకం
డెడ్‌స్టోరేజీకి పడిపోయిన జూరాల

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 24: నిత్యం కరవు కాటకాలలకు నిలయమైన పాలమూరు జిల్లాలో ఇన్నాళ్లు ఉపాధి కోసం వలసలు పోయిన దృశ్యాలు చూశాం. కానీ ఇప్పుడు తాగునీటికోసం పల్లెలను విడిచిపెట్టే దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో వరదప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీకి పడిపోయింది. ఈ ప్రాజెక్టుపై ఆధారపడిన రామన్‌పాడు, కోయిల్‌సాగర్, జమ్ములమ్మ జలాశయాలు వట్టిపోయాయి. దీంతో ఏంచేయాలో అర్థంకాక జనం తలలు పట్టుకుంటున్నారు. తాగునీటి కష్టాలు గట్టెక్కేదెలా అంటూ నానాతంటాలు పడుతున్నారు. తెలంగాణ ముఖద్వారమైన కృష్ణానదిపై ఉండే మొదటి ప్రాజెక్టు జూరాల డెడ్‌స్టోరేజీకి పడిపోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాజెక్టుకు అనుసంధానమైన సాగునీటి ప్రాజెక్టులన్నీ అడుగులు దీరి దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలో దాదాపు 640 గ్రామాలకు సాగునీరందించే రామన్‌పాడు జలాయశయం నీటిమట్టం పూర్తిగా పడిపోయింది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు ద్వారా అచ్చంపేట నీటి పథకంలో భాగంగా 380 గ్రామాలకు మంచినీటి సరఫరా గత నాలుగు రోజుల నుండి నిలిచిపోయాయి. జడ్చర్లకు వెళ్లే తాగునీటి పథకం కూడా ఆగిపోయింది. ఇక మిగిలింది మహబూబ్‌నగర్ రామన్‌పాడు పథకం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 0.38 టిఎంసిల సామర్థ్యంగల జలాశయంలో నీళ్లులేక వట్టిపోయింది. ఇదిలాఉండగా కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకం ఎండిపోయి బీటలు వారింది. జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 4 టిఎంసిల నీటి మట్టం ఉంది. ఈ ప్రాజెక్టు కూడా డెడ్ స్టోరేజీకి పడిపోవడంతో పలు తాగునీటి ప్రాజెక్టులకు నీటి సరఫరా నిలిపివేశారు. రామన్‌పాడు జలాశయం, కురుమూర్తిరాయ ఎత్తిపోతల పరిధిలో రైతులు సాగుచేసిన వరిపైర్లు కూడా వెన్నుముఖం పట్టాయి. బుధవారం తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతమ్మతోపాటు తెదేపా జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఎండిపోయిన కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకాన్ని అడుగంటిన రామన్‌పాడు జలాశయాన్ని డెడ్‌స్టోరేజీకి చేరుకున్న జూరాల ప్రాజెక్టును పరిశీలించారు. నీరులేక బీటలువారిన వరిపైర్లను పరిశీలించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, పంటలు ఎండిపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.25 వేల పంట నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించిన 791 కోట్ల సహాయాన్ని రాష్ట్ర రైతాంగానికి అందించాలన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఫాంహౌస్‌ను వదిలి క్షేత్రస్థాయిలోకి రావాలని రావుల చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

తగ్గుతున్న సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్, ఫిబ్రవరి 24: శ్రీశైలం జలాశయం నుండి నాగార్జున సాగర్ జలాశయానికి నీటి చేరిక పూర్తిగా నిలిచిపోవడంతో సాగర్ జలాశయం నీటిమట్టం రోజురోజుకూ తగ్గిపోతోంది. బుధవారం సాయంత్రానికి సాగర్ జలాశయం నీటిమట్టం 508.50 అడుగులకు చేరుకుంది. ఇది 129.8101 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుండి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1083 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. టోటల్ అవుట్‌ఫ్లోగా 1083 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 821.80 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఇది 42.1486 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుండి ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి నీటి సరఫరా నిలిచిపోవడంతో సాగర్‌లో ప్రస్తుతం విద్యుత్ ఉత్పాదన పూర్తిగా నిలిచిపోయింది.

మహబూబ్‌నగర్ జిల్లాలో అడుగంటిన రామన్‌పాడు.. ఎండిపోయన జూరాల

నీడి జాడ లేని కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకం

శ్రీ విద్యాధరి క్షేత్రంలో ఘనంగా
కోటి గాయత్రీ జపయజ్ఞం

గజ్వేల్, ఫిబ్రవరి 24: మెదక్ జిల్లా వర్గల్‌లోని శ్రీ విద్యాధరి క్షేత్రంలో బుధవారం చతుర్వేద స్వాహాకార సహిత శ్రీ మాత కోటి గాయత్రి జపయజ్ఞం బుధవారం ఘనంగా ఆరంభమైంది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యాయవరం చంద్రేశఖరశర్మ సిద్ధాంతి, కిషన్‌శర్మ, గోపాల కృష్ణశర్మ, హరినాథశర్మ ఈ యజ్ఞానికి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్యాశంకర భారతితీర్థ, రాంపూర్ పీఠాధిపతి మాధవానంద సరస్వతీతీర్థలు హాజరై అనుగ్రహ భాషణం చేశారు. మొదటగా గోపూజ, గురువందనం, వేదఘోష పూర స్వరముగా విశ్వశాంతి మహా సంకల్పం, మహా గణపతి హోమం, చతుర్వేద స్వాహాకారాలు గాయత్రి హోమం తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో నిర్వాహకులు దివాకర్‌రావు, గోపాలకృష్ణశర్మ, ఆంజనేయ శర్మ, నాగేందర్‌రావు, మురళీశర్మ, సనాతన శర్మ, చంద్రకాంత శర్మ పాల్గొన్నారు.

చతుర్వేద స్వాహాకార గాయత్రీ జపయజ్ఞానికి అంకురార్పణ చేస్తున్న వేద పండితులు... విశేష అలంకరణలో శ్రీ విద్యాధరి అమ్మవారు.

పోచమ్మ మైదానం
సింగరేణిదే!

రూ.కోట్ల విలువైన భూమిని దక్కించుకున్న సింగరేణి
30 రోజుల్లో స్వాధీనం చేసుకోవాలి కోర్టు సంచలన తీర్పు

గోదావరిఖని, ఫిబ్రవరి 24: కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని సింగరేణికి చెందిన కోట్లాది రూపాయల విలువ చేసే పోచమ్మ మైదానం భూమి సింగరేణి సంస్థదే అని బుధవారం ఎవెక్షన్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. గత రెండేళ్ల నుండి సింగరేణి ఎవెక్షన్ కోర్టులో విచారణ వాయిదాలపై వాయిదాలు పడుతూ కొనసాగింది. ఎట్టకేలకు ఎవెక్షన్ కోర్టు జడ్జి వెంకట్రామయ్య తీర్పును వెల్లడించడంతో గత కొంతకాలం నుండి భూ ఆక్రమణలపై పోరాటం చేస్తున్న పలు పార్టీల నాయకులు, కార్మిక సంఘాల నాయకుల సంబరాలను జరుపుకున్నారు. వివరాల్లోకి వెళ్తే...స్థానిక ప్రధాన చౌరస్తాలోని పోచమ్మ మైదానం వద్ద గత జనగామ శివారుకు చెందిన సర్వేనంబర్ 693లో 39 గుంటల భూమి కబ్జా చేసి 11 మంది అక్రమంగా నిర్మాణాలు జరిపారు. ఆక్రమణకు గురైన ఈ 39 గుంటల భూమి సింగరేణి సంస్థదేనని యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. దీంతో సింగరేణి ఎస్టేట్ అధికారికి ఎవెక్షన్ కోర్టు బాధ్యతలు అప్పగించి విచారణ జరిపించారు. 2014 నుండి జరుగుతున్న విచారణ అనేక దఫాలుగా వాయిదాలు పడింది. సింగరేణి సంస్థ పూర్తి ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో సింగరేణి భూమిని దక్కించుకోగలిగింది. కాగా, కోర్టు వెల్లడించిన తీర్పు ప్రకారం 30 రోజుల్లోగా ఆక్రమణ దారులు సింగరేణికి భూమిని తిరిగి అప్పగించాలని పేర్కొంది. తీర్పు అనంతరం సింగరేణి అధికారులు స్పందిస్తూ భూమి సకాలంలో అప్పగించకుంటే స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. కోట్లాది రూపాయల విలువ చేసే సింగరేణి భూమి విచారణ అనేక మలుపులు తిరిగి ఉత్కంఠగా కొనసాగి, ఎట్టకేలకు సింగరేణి సంస్థ దక్కించుకోవడంతో ఇదే తరహాలో సింగరేణి ఏరియాలో భూమిని ఆక్రమించుకున్న మరికొంతమంది గుండెల్లో కూడా రైళ్ళు పరిగెడుతున్నాయ.

కోర్టు తీర్పు అనంతరం సంబరాలు జరుపుకుంటున్న
నాయకులు.. కబ్జాకు గురైన సింగరేణి భూమిలో
జరిపిన అక్రమ నిర్మాణాలు

కొనసాగుతున్న జన జాతర
మేడారంలో లక్షమంది భక్తుల మొక్కులు భక్తులతో కిక్కిరిసిపోయిన గద్దెల ప్రాంగణం

గోవిందరావుపేట/ఏటూరునాగారం 24: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన వరంగల్ జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల జాతరకు భక్తులు బుధవారం భారీగా తరలివచ్చారు. మంగళవారం అర్ధరాత్రి నుండే భక్తుల రద్దీ ప్రారంభం కాగా బుధవారం సాయంత్రం వరకూ రద్దీ కొనసాగింది. బుధవారం లక్షమంది భక్తులు తల్లులను దర్శించుకుని తరించారు. బుధవారం తిరుగువారం జరుగుతుండడంతో ప్రతిసారి జాతర ముగిసిన తర్వాత స్థానికులతోపాటు ఇతర ప్రాంతాలవారు వచ్చి తల్లులకు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి బుధవారం ఇతర జిల్లాల నుండి సైతం భక్తులు భారీగానే మేడారం వచ్చి తల్లులకు మొక్కులు చెల్లించుకున్నారు. జంపన్నవాగులో నీరు లేక వెలవెలబోయినా భక్తుల వరద మాత్రం బుధవారం జంపన్నవాగులో కనిపించింది. జంపన్నవాగు గద్దె వద్ద ముడుపులతో భక్తులు చెట్టుచుట్టూ కట్టడంతో ఆకుల కంటే భక్తుల ముడుపులే జంపన్నవాగు గద్దెపై దర్శనమిచ్చాయి. జల్లుస్నానాలు చేసిన భక్తులు తలనీలాలు సమర్పించుకుని తల్లుల దర్శనం కోసం బారులు తీరి కనిపించారు. గద్దెల ప్రాంగణం వరకూ వాహనాలు వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సమ్మక్క తల్లి గద్దె వద్ద ఒకవైపు గేటు తెరిచి ఉంచడంతో భారీగా తరలివచ్చిన భక్తులు తల్లి గద్దెను ఎక్కి మొక్కులు చెల్లించుకునేందుకు ఆరాటపడ్డారు. దీంతో భారీగా తోపులాట జరిగింది. ఒకే గేటు నుండి భక్తులు రావడం, పోవడం జరగడంతో మహిళలు, వృద్ధులు, పిల్లలు బంగ