తెలంగాణ

అనాథగా హక్కుల కమిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: రాష్ట్ర మానవహక్కుల కమిషన్ అనాథగా మారుతోంది. ఎంతోకాలంగా అనేక కేసులను యుద్ధప్రాతిపదికపై విచారణ చేసి తీర్పులు ఇస్తూ వస్తున్న ఈ కమిషన్, రెండు రాష్ట్ర ప్రభుత్వాల (తెలంగాణ-ఎపి) మధ్య నలుగుతోంది. రాష్ట్ర విభజన జరిగి రెండున్నర ఏళ్లు గడిచినప్పటికీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఇప్పటివరకు ఇదే కమిషన్ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాలు కూడా ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేసుకోకపోవడంతో పాత కమిషన్ సభ్యులు లేకుండా చైర్‌పర్సన్ ఒక్కరితోనే కుంటిగా నడుస్తోంది. కమిషన్‌కు ఒకరిని చైర్‌పర్సన్‌గా, ఇద్దరిని మెంబర్లుగా నియమించాల్సి ఉంటుంది. వీరి పదవీ కాలం ఐదేళ్లపాటు ఉంటుంది. ఆరేళ్ల క్రితం నియామకం అయిన సభ్యుడు (నాన్-జుడిషియల్) కె పెద పేరిరెడ్డి, మెంబర్ (జుడిషియల్) ఎం రామారావు పదవీకాలం గత ఏడాది ముగిసింది. వీరి స్థానంలో కొత్తవారిని నియమించలేదు. అలాగే ఐదేళ్ల క్రితం చైర్‌పర్సన్‌గా నియమితులైన హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రు పదవీకాలం ఈ నెల చివరితో ముగుస్తుంది. వాస్తవంగా చైర్‌పర్సన్ పదవీకాలం ముగిసేందుకు కనీసం నెల రోజుల ముందే కొత్త చైర్‌పర్సన్ పేరును ప్రభుత్వం ప్రకటించాలి. అయితే రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు కాబోయే చైర్‌పర్సన్ ఎవరో ఇప్పటివరకు ప్రకటించలేదు.
డిసెంబర్ చివరిలో నిసార్ అహ్మద్ పదవీకాలం ముగుస్తుండటంతో కొత్త సంవత్సరం ప్రారంభమైతే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్, సభ్యులు లేకుండా కొనసాగాల్సి ఉంటుంది. నియామకాల విషయంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ, అటు ఎపి ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం రెండు రాష్ట్రాలకు ఒకే కమిషన్ కొనసాగుతుండటంతో కమిషన్‌కు అయ్యే ఖర్చును రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రానికి ప్రత్యేకంగా ‘తెలంగాణ మానవహక్కుల కమిషన్’ను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తుండగా, ఎపి ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్’ ను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది. ఈ అంశంపై ఇటు తెలంగాణ సిఎం కెసిఆర్ ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, అటు చంద్రబాబు ఆదేశాల మేరకు ఎపి ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ కసరత్తు చేస్తున్నారని తెలిసింది.