తెలంగాణ

రైతు సంక్షేమం ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన 30 నెలల్లో మూడువేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ శాసనసభాపక్షం నాయకుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. మా ప్రభుత్వం రైతు పక్షపాతి, రైతుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామంటూ మీరు పదేపదే చెబుతున్నా, రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని రేవంత్ విమర్శించారు. తాను ఇటీవల ‘రైతు పోరుయాత్ర’లో భాగంగా నిర్వహించిన పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చేందుకు ఈ బహిరంగ లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.
ఆ లేఖలో ‘మీరు చెబుతున్నట్లుగా రైతు సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ముఖ్యంగా మీరు రైతులకు ఏకమొత్తంలో రుణ మాఫీ చేయకుండా విడతల వారీగా మాఫీ మొత్తాలను బ్యాంకులకు విడుదల చేస్తున్నారు. ఈ మొత్తాలు రైతుల ఖాతాలలో జమ అవుతున్నా అందులో ఎక్కువ భాగం వడ్డీల కింద బ్యాంకర్లు జమ చేసుకుంటున్నారు, వడ్డీ పోను మిగిలిన మొత్తాలను మాత్రమే రైతులకు విడుదల చేస్తున్నారు. బ్యాంకు కొత్త రుణాలు ఇవ్వని కారణంగా అప్పుల కోసం రైతులు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. వాటిని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు చెబుతున్నట్లుగా రైతులు దావత్‌లు కాదు కదా కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు’ అని రేవంత్ పేర్కొన్నారు.