తెలంగాణ

మల్లన్ననే మారుస్తారా? ఊరుకోం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, డిసెంబర్ 13 : భక్తుల కొంగు బంగారమైన కొమురవెల్లి మలన్న ఆలయంలో పుట్టమన్నుతో ఏర్పడిన స్వయంభూ మూలవిరాట్‌ను తొలగించి గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్దదుమారాన్ని రేపాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని, బేషరుతుగా క్షమాపణ చెప్పాలని వివిధ పార్టీల నేతలు, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. మంగళవారం ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలతో నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఇదీ చరిత్ర
ఏటా మార్గశిర మాసంలో ఆఖరి ఆదివారం నుంచి కల్యాణోత్సవాలు నిర్వహించడం కొమురవెల్లి మల్లన్న ఆలయంలో రివాజు. ఫాల్గుణమాసం ఆఖరి ఆదివారం వరకు భారీ ఎత్తున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ మూడునెలల పాటు ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంటుంది. దాదాపు 800 సంవత్సరాల చరిత్ర ఉన్న కొమురవెల్లి మల్లన్న అంటే భక్తులు ఎంతో ఇష్టం.
ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం ఇటీవల నిర్వహించారు. ఆ సందర్భంలో ఎమ్మెల్యే యాదగిరి మాట్లాడారు. పుట్టమన్నుతో సహజసిద్ధంగా ఏర్పడ్డ మల్లన్న విగ్రహం తొలగించి గ్రానైట్ విగ్రహం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. దీనిపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆందోళన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాల భక్తుల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ ర్యాలీ, దిష్టిబొమ్మ దగ్ధం
మల్లన్న మూలవిరాట్‌ను తొలగిస్తానని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వెనుక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొమురవెళ్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించి, ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సిద్దిపేటలో బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే యాదగరిరెడ్డి తన వ్యాఖ్యలు వెనుక్కి తీసుకోవాలని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బిజెవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాలకు చెందిన యాదవ, వీరశైవ సంఘాల నేతలు సైతం ఎమ్మెల్యే తన వ్యాఖ్యలు వెనుక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్దనిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.

చిత్రం..ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న కాంగ్రెస్ నేతలు