తెలంగాణ

మాదే అధికారం.. నేనే సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 13: తొందరపడి ఓ కోయిల ముందే కూసిందన్నట్లుగా 2019 ఎన్నికల్లో అధికారం దక్కుతుందో లేదో తెలియకపోయినా సీఎం పదవి తనదంటే తనదేనంటు టిపిసిసి సీనియర్ నేతల ప్రకటనలు వేడిపుట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌లో కలకలానికి, మిగతావారు నవ్వుకోవడానికి ఈ ప్రకటనలు ఉపకరిస్తున్నాయి. 2014ఎన్నికలకు ముందు తెలంగాణ సీఎం తానే అవుతానంటు సీనియర్ నేత కె.జానారెడ్డి పడ్డ కలలు కల్లలైపోగా ఇప్పుడు ఇదే జిల్లాకు చెందిన సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాజాగా తన అదిలాబాద్ పర్యటనలో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, తానే సీఎంను అవుతానంటు ఆసక్తికర వాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చకు మొదలైంది. తాను త్వరలోనే తెలంగాణ పిసిసి అధ్యక్షుడినవుతానంటు నిన్నటిదాకా చెప్పుకున్న కోమటిరెడ్డి ఇప్పుడు మరో అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల తరువాత ఏకంగా సీఎంనే అవుతానంటు సంచలన వాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి తాజా వాఖ్యలు నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్లు కె.జానారెడ్డి, పిసిసి చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డిలకు చికాకు తెప్పించేవే. ముఖ్యంగా పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఈ వ్యవహారం ఆగ్రహం తెప్పిస్తుంది. టి.కాంగ్రెస్‌లో వీరిద్దరి మధ్య వైరం కొనసాగుతుండగా కోమటిరెడ్డి తాజా వాఖ్యలు దానికి మరింత ఆజ్యం పోయనున్నాయి. ఇప్పటికే నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో ఉత్తమ్, కోమటిరెడ్డి, దామోదర్ రెడ్డి, పాల్వాయి, జానాలు గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయి. ఇదే పార్టీ అభివృద్ధికి పెద్ద ఆటంకం. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో రాదో తెలియకపోయినా సీఎం కుర్చీపై మాత్రం టి.కాంగ్రెస్ సీనియర్ల ముందస్తు పేచీ పార్టీ బలోపేతానికి గుదిబండగా మారనుందని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతుండగా ప్రజాసమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు అస్తశ్రస్త్రాలతో సిద్ధం కావాల్సిన టి.కాంగ్రెస్ నేతలు అంతర్గత కుమ్ములాటలతో అధికార పక్షంపై దాడిలో ఎంత మేరకు సఫలీకృతమవుతారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగమన్నట్లుగా టి.కాంగ్రెస్ నేతల వ్యవహారశైలి ఉందంటు విమర్శలు వస్తున్నాయి.
దూకుడు అందుకే..
ఆది నుండి తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటున్న సొంత జిల్లా కాంగ్రెస్ నేతల తీరుపై అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి ఒక దశలో టిఆర్‌ఎస్ వైపు అడుగులేశారు. ఊహించని రీతిలో ఎంపి గుత్తా టిఆర్‌ఎస్‌లోకి వెళ్లడంతో కోమటిరెడ్డి ఇక కాంగ్రెస్‌లోనే తన రాజకీయ భవిష్యత్‌ను తేల్చుకోవాలని గట్టిగా నిర్ణయించి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పిసిసి సారధిగా ఉత్తమ్ పనికిరాడని, తనకు పిసిసి పగ్గాలిస్తే తెలంగాణ అంతటా పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తానన్న కోమటిరెడ్డి ఇప్పుడు ఏకంగా కాబోయే సీఎంను తానేనంటు పార్టీలో ప్రకంపనలు రేపారు. ఇప్పటికే కాంగ్రెస్ ముందస్తు కలల సీఎం రేసులో జానా, ఉత్తమ్, భట్టి, డి.కె.అరుణ, జీవన్‌రెడ్డి, హనుమంతరావు వంటి నేతలు ఉండగా కొత్తగా ఈ జాబితాలో కోమటిరెడ్డి చేరారు.
అసలే టిఆర్‌ఎస్ ఫిరాయింపుల ధాటికి చిక్కి వలసలతో చితికిపోయిన టి.కాంగ్రెస్‌కు సీనియర్ల సీఎం కుర్చీ పంచాయతీ మరింత నష్టదాయకమవుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపధ్యంలో మునుముందు కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిణామాలు మరెన్ని మలుపులకు, కుదుపులకు కారణమవుతాయోనని శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రంలో అధికారం కోల్పోయి పాట్లు పడుతున్న కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై దృష్టి సారిస్తుందా అన్నది ఇప్పుడు ప్రశ్న.