తెలంగాణ

నగదు రహితంగా తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: ఆర్థిక లావాదేవీలన్నింటినీ నగదు రహితంగా మార్చడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో సంస్థాగతంగా బ్యాంకులు బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. నగదు రహిత లావాదేవీల నిర్వహణపై గ్రామ సభలు నిర్వహించి బ్యాంక్ అకౌంట్లు, కార్డుల నిర్వహణపై అవగాహన కల్పించాలని బ్యాంకర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. నగదు రహితంగా తీర్చిదిద్దాలంటే బ్యాంకర్లు మొదట తమ పనితీరు మెరుగు పర్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. క్యాంపు కార్యాలయంలో (ప్రగతి భవన్) మంగళవారం 12 ప్రముఖ బ్యాంకులకు చెందిన ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు తదితరులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
సిద్దిపేట నియోజకవర్గాన్ని మొదట నగదు రహితంగా తీర్చిదిద్దే క్రమంలో ఎదురయ్యే అనుభవాల నేపథ్యంలో రాష్టవ్య్రాప్తంగా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహనకు రావాలని బ్యాంకర్లకు ముఖ్యమంత్రి సూచించారు. నగదు రహిత లావాదేవీల నిర్వహణకు తగినన్ని స్వైప్ మిషన్లు అందుబాటులోకి రావాలని, అయితే డిమాండ్‌కు తగినన్ని సమకూరడం లేదని ముఖ్యమంత్రి అన్నారు. సిద్దిపేట జిల్లాకు నాలుగు వేల స్వైప్ మిషన్లను సమకూర్చడంతో పాటు అందరికీ బ్యాంక్ అకౌంట్లు, డెబిట్ కార్డులను అందజేయాలని ఆదేశించారు. డెబిట్ కార్డుల ద్వారానే కాకుండా మొబైల్ యాప్‌ల ద్వారా లావాదేవీల నిర్వహణను ప్రోత్సహించాలని సూచించారు. వీటిపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి బ్యాంకు అకౌంట్ల నిర్వహణ, కార్డుల వినియోగాన్ని వివరించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రామ సభలలోనే కార్డులను అందజేయాలన్నారు. డెబిట్ కార్డుల ద్వారానే కాకుండా మొబైల్ యాప్‌లను ఆర్థిక లావాదేవీలు నిర్వహణకు విద్యార్థులను ఉపయోగించుకుని వారి ద్వారా ప్రజలను చైతన్య పర్చాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్టీసి బస్సులలో పూర్తి స్థాయిలో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, చార్జీలు చెల్లించడానికి మొబైల్ యాప్‌లను విరివిగా వినియోగించేలా ప్రజలను చైతన్యం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

చిత్రం..నగదు రహిత లావాదేవీలతో మంగళవారం హైదరాబాద్‌లో బ్యాంకర్లు, అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్