రాష్ట్రీయం

ఏ ఏటిఎంలోనూ డబ్బుల్లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13:పెద్ద నోట్ల రద్దు తరువాత 35 రోజులు గడిచిపోయిన తరువాత కూడా బ్యాంకులు, ఎటిఎంల వద్ద భారీ క్యూలు తప్పడం లేదు. హైదరాబాద్ నగరంలో 98శాతం ఎటిఎంలు పని చేయడం లేదు. కరెన్సీ నోట్ల రద్దు తరువాత ఎటిఎంలలో డబ్బులు కనిపించడం లేదు. దీంతో దీన్ని కూడా వ్యాపారానికి ఉపయోగించుకోవడానికి కొన్ని యాప్స్‌ను ప్రారంభించారు. ఈ యాప్స్ ఉపయోగించి ఏ నగరంలో ఏ ఎటిఎంలో డబ్బులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఎక్కడ ఎటిఎంలు డబ్బులుంటే అక్కడికి వెళ్లవచ్చు అనే ఉద్దేశంతో చాలా మంది ఈ యాప్‌ల మీద ఆధారపడ్డా, యాప్ అందుబాటులో ఉంది కానీ ఎటిఎంలో డబ్బులు లేవు. ఈరోజు హైదరాబాద్‌లో 98శాతం ఏటిఎంలు పని చేయడం లేదు. ఒకటి అరా ఎటిఎంలలో డబ్బులు ఉన్నా, భారీ క్యూలు తప్పడం లేదు. శనివారం నుంచి మూడు రోజుల పాటు వరుస సెలవుల తరువాత ఈరోజు బ్యాంకులు పని చేసినా భారీ క్యూలతో సతమతం అయ్యాయి. వారానికి 24వేల రూపాయలు తీసుకునే అవకాశం ఉన్నా, రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఈ సమస్యలు ఇంకెన్ని రోజులో అర్ధం కావడం లేదని ఖాతాదారులు వాపోతున్నారు. హైదరాబాద్‌లోని పాత నగరంలో బ్యాంకుల వద్ద జనం సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. రోజు కూలీపై బతికే వారు, చిన్న వ్యాపారులు నగదు లేక ఇబ్బంది పడుతున్నారు. పలు చోట్ల ఖాతాదారులకు, బ్యాంకు ఉద్యోగులకు మధ్య ఘర్షణలు తప్పడం లేదు. పాత నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడంతో బ్యాంకుల వద్ద పోలీసు భద్రతను పెంచారు.