రాష్ట్రీయం

ఇంధన పొదుపులో భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వేకు తొమ్మిది జాతీయ ఇంధన పొదుపు అవార్డులు లభించాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర విద్యుచ్ఛక్తి, బొగ్గు, కొత్త పునరుత్పాదక ఇంధనాలు, గనుల శాఖ మంత్రి పియూష్ గోయల్ చేతుల మీదుగా దక్షిణ మధ్య రైల్వే జిఎం వశిష్ఠ జోహ్రీ ఈ అవార్డులను అందుకున్నారు. 2016 సంవత్సరానికి గానూ మొత్తం భారతీయ రైల్వేలోని అన్ని జోన్లకు 27 అవార్డులు లభించగా, అందులో 9 అవార్డులను దక్షిణ మధ్య రైల్వే కైవసం చేసుకుంది.
జోనల్ రైల్వేస్‌కు, రైల్వే వర్క్‌షాప్స్‌కు, ఆఫీస్ బిల్డింగ్స్‌కు ప్రథమ బహుమతులు వచ్చాయి. సాంకేతికంగా ఇంధన సామర్థ్యానికి సంబంధించి పలు చర్యలు తీసుకోవడంతోపాటు ఇంధన పొదుపునకు ముమ్మరంగా దక్షిణ మధ్య రైల్వే చర్యలు తీసుకుంది. గత సంవత్సరం ఏకంగా ఏడు అవార్డులు అందుకోగా, ఈ ఏడాది రికార్డు సంఖ్యలో 9 అవార్డులను అందుకుంది. ఈ అవార్డులు దక్షిణ మధ్య రైల్వేలో జోనల్ రైల్వేస్ సెక్టార్ కేటగిరి కింద ప్రథమ బహుమతి, ఆఫీస్ బిల్డింగ్స్ సెక్టార్‌లో సికిందరాబాద్‌లోని పిఆర్‌ఎస్ బిల్డింగ్‌కు ప్రథమ బహుమతి, రైల్వే వర్క్‌షాపు సెక్టార్‌లో కాజీపేటలోని ఎలక్ట్రికల్ లోకోషెడ్, ఆఫీస్ బిల్డింగ్స్ సెక్టార్‌లో సికిందరాబాద్‌లోని లేఖా భవన్‌కు ద్వితీయ బహుమతి, విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ శిక్షణా సంస్థలున్న భవనాల కేటగిరీలలో సికిందరాబాద్‌లోని ఇరిసెట్ సంస్థ భవనానికి ద్వితీయ బహుమతి, సర్ట్ఫికేట్ ఆఫ్ మెరిట్ బహుమతి, ఆసుపత్రుల కేటగిరిలో నాందేడ్‌లోని రైల్వే ఆసుపత్రికి, శిక్షణా సంస్థల భవనాల కేటగిరిలో విజయవాడలోని ఎలక్ట్రిక్ ట్రాక్షన్ శిక్షణా కేంద్రం భవనానికి, రైల్వే స్టేషన్ కేటగిరిలో పాకాల స్టేషన్‌కు, రైల్వే వర్క్‌షాపు సెక్టార్‌లో విజయవాడలోని డీజిల్ లోకోషెడ్‌కు బహుమతులు లభించాయి. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్‌తోపాటు అవార్డులు అందుకున్న వారిలో దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ జాన్ థామస్, చీఫ్ ఎలక్ట్రికల్ జనరల్ ఇంజనీర్ అగర్వాల్, సికిందరాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గోపాల్, హైదరాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆనంద చెక్కి తదితరులు ఉన్నారు.

చిత్రం... కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న దక్షిణ మధ్య రైల్వే జిఎం వశిష్ఠ జోహ్రీ