తెలంగాణ

సచివాలయంలో విద్యార్థుల హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: తెలంగాణ సచివాలయంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక విద్యార్థులు ఐదుగురు బుధవారం హల్‌చల్ చేశారు. ఐదుగురు విద్యార్థులు సచివాలయంలోకి వేరే పని ఉందంటూ పాస్ తీసుకుని వెళ్లారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు ఉండే ‘సి’ బ్లాక్ ‘సమతా’ ముందు హఠాత్తుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలంటూ వారు డిమాండ్ చేశారు. సమతా బ్లాక్‌లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నిస్తున్న ఈ విద్యార్థి ప్రతినిధులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు హుటాహుటిన తరలించారు. సిఆర్‌పిసి 151 సెక్షన్ కింద కేసు నమోదు చేసి సొంత పూచీకత్తుపై వెంటనే విడుదల చేశారు.

ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలంటూ బుధవారం సమతాబ్లాక్‌లోకి చొచ్చుకెళ్లడానికి యత్నిస్తున్న
విద్యార్థులను అడ్డుకుంటున్న పోలీసులు