రాష్ట్రీయం

ద.మ. రైల్వేకు రూ.6,412 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు పెద్ద షాకిచ్చారు. విశాఖ, కాజిపేట రైల్వే డివిజన్ల ఏర్పాటు ప్రస్తావన, కొత్త రైళ్ల ఊసే బడ్జెట్‌లో లేకపోవడం గమనార్హం. కానీ దక్షిణ మధ్య రైల్వేకు బడ్జెట్‌లో రూ.6,412 కోట్లు కేటాయించి గత బడ్జెట్ కన్నా 145 శాతం అధికంగా ఇచ్చామని దమ రైల్వే జనరల్ మేనేజర్ గుప్తా చెప్పుకొచ్చారు. గురువారం రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ తెలంగాణలో ప్రధానమైన ఘట్‌కేసర్- రాయగిరి (యాదా ద్రి) ఎంఎంటిఎస్ ప్రాజెక్టుకు రూ.330 కోట్ల అంచనాతో కొత్త ప్రాజెక్టును మంజూరు చేసింది. చర్లపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న శాటిలైట్ రైల్ టెర్మినల్ ఏర్పాటు పనులకు రూ.80 కోట్ల అంచనాతో మంజూరు చేసింది. కాజిపేట వర్క్‌షాప్ పనులకు రూ.20 కోట్లు, కాజిపేట ఎలక్ట్రికల్ లోకోషెడ్ పని సామర్ధ్యాన్ని 125 లోకోల నుంచి 175కి పెంచేందుకు గాను రూ.18 కోట్లు కేటాయించింది. ఎంఎంటిఎస్ రెండో దశ పనులకు కొత్తగా నిధులు ప్రకటించలేదని, రెండో దశ పనులను 2017 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని జిఎం తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎంఎంటిఎస్‌ను కలిపే ప్రణాళిక ఇప్పట్లో లేదని, మూడో దశ ప్రాజెక్టులో శంషాబాద్‌లో కొత్త టెర్మినల్ నిర్మాణం జరిగిన తర్వాతే అది సాధ్యపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు- గుంతకల్లు మధ్య రైల్వే డబ్లింగ్ పనులను రూ.4 వేల కోట్ల అంచనాతో ఆమోదించినట్లు తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్‌పై ప్రయాణికుల ఒత్తిడి తగ్గించేందుకు గాను తిరుచానూరు రైల్వే స్టేషన్‌ను రూ.10 కోట్ల వ్యయంతో సి క్లాస్ నుంచి బి క్లాస్ స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు అనుమతించిందని జిఎం తెలిపారు. కాగా ప్రస్తుతం కొనసాగుతున్న కొత్త ప్రాజెక్టుల్లో ముఖ్యమైన జగ్గయ్యపేట-మేళ్లచెర్వు-జనపహాడ్ లైన్ పనులకు రూ.110 కోట్లు, విజయవాడ-్భమవరం-నిడదవోలు లైను డబ్లింగ్ పనులకు రూ.80 కోట్లు, కోటిపల్లి-నరసాపూర్ లైన్ పనులకు రూ.200 కోట్లు, నడికుడి-శ్రీకాళహస్తి లైన్ పనులకు రూ.180 కోట్లు రైల్వే మంత్రి ఈ బడ్జెట్‌లో కేటాయించారని జిఎం వెల్లడించారు. పెద్దపల్లి-కరీంగనర్-నిజామాబాద్ ప్రాజెక్టుకు రూ.70 కోట్లు, మంచిర్యాల-పెద్దంపేట ట్రిప్లింగ్ పనులకు రూ.31 కోట్లు, మనోహరాబాద్-కొత్తపల్లి ప్రాజెక్టు పనులకు రూ.30 కోట్లు కేటాయింపు జరిగిందని జిఎం వివరించారు. హైదరాబాద్ శివారులోని నాగులాపల్లి వద్ద పిపిపి పద్దతిలో శాటిలైట్ టెర్మినల్‌ను అభివృద్ధి చేసేందుకు, తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందం మేరకు సబర్బన్ రైళ్ల సర్వీస్‌ను అభివృద్ధి చేసేందుకు బడ్జెట్‌లో పొందుపర్చారని తెలిపారు.