ఆంధ్రప్రదేశ్‌

విశాఖ జూలో కోతుల దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 14: వినడానికి చిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజం. మదర్స్‌డే, ఫాదర్స్‌డే, వరల్డ్ హెల్త్‌డే, తాజాగా యోగా డే మాదిరి ప్రపంచ కోతుల దినోత్సవాన్ని జరుపుకోవడం నిజంగా వింతే. ప్రపంచంలో పలు రకాల దినోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్న మానవాళి కోతుల కోసం ప్రత్యేకంగా ఒక రోజును ఎందుకు కేటాయించకూడదు అనుకుందో ఏమో. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 14న ప్రపంచ కోతుల దినోత్సవాన్ని జరుపుకోవాలని కొన్ని దేశాలు నిర్ణయించాయి. దీనిలో భాగంగానే తొలి సారిగా విశాఖ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాలలో బుధవారం కోతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ జంతు ప్రదర్శన శాల క్యూరేటర్ బి విజయ్‌కుమార్ సారథ్యంలో పాఠశాల విద్యార్థులతో ఈ పండుగను ఘనంగా నిర్వహించారు. కోతుల దినోత్సవంలో భాగంగా జూలో దాదాపు 200 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి, జంతు ప్రేమపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్యూరేటర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి జీవికీ ఒక నిర్దిష్టమైన చరిత్ర ఉంటుందని, దీన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనపై ఉందన్నారు. మనిషి రక్తంలో ఉండే గ్రూపులను కోతి రక్తాన్ని పరీక్షించిన మీదటే విభజించారని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 200 జాతుల కోతులు జీవిస్తున్నాయన్నారు. ఆసియా, ఆఫ్రికా ఖండాలకు చెందిన కోతులు పూర్వ కాలం నుంచి జీవిస్తున్నాయని, అమెరికా వంటి దేశాల్లో సంచరించే వానరాలు తదనంతర కాలక్రమంలో పుట్టుకొచ్చాయన్నారు. కోతులకు జ్ఞానం, తెలివి అధికమని, వీటిని అనుసరించే మానవుడు తన జీవనాన్ని మలచుకున్నాడని పేర్కొన్నారు.