తెలంగాణ

‘ఉత్తమ నవలా చక్రవర్తి’ ముదిగొండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), డిసెంబర్ 15: కావ్యాలు, కథలు, విమర్శ, హిందూమత మహావర్ణన, వీటన్నింటికి తోడు విమర్శకుల ప్రశంసలు పొందిన చారిత్రక నవలలెన్నింటినో రచించిన ఆచార్య ముదిగొండ శివప్రసాద్ తెలుగుజాతి మెచ్చిన అత్యుత్తమ చారిత్రక నవలా చక్రవర్తి అని పలువురు ప్రముఖులు కొనియాడారు. గురువారం రాత్రి గుంటూరులోని బృందావన గార్డెన్స్ అన్నమయ్య కళావేదికపై సుప్రసిద్ధ సాహితీవేత్త ముదిగొండ శివప్రసాద్‌కు తుమ్మల కళాపీఠం ఈ ఏటి సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సభకు అధ్యక్షత వహించిన పీఠం అధ్యక్షుడు డాక్టర్ కె బసవపున్నయ్య ప్రసంగిస్తూ తెలుగుభాష, సంస్కృతి, సాహిత్య వికాసానికి ఆచార్య ముదిగొండ వెలకట్టలేని సేవలందించారన్నారు. సభను నిర్వహించిన శ్రీనాథ పీఠం సంచాలకులు, ప్రముఖ కవి పిఎస్‌ఆర్ ఆంజనేయప్రసాద్ ప్రసంగిస్తూ శివప్రసాద్ వచనం, రచనా విన్యాసం ప్రత్యేకతను చాటుకుందన్నారు. తుమ్మల కళాపీఠం కార్యదర్శి పులిచెర్ల సాంబశివరావు, ప్రముఖ నటుడు, గాయకుడు డాక్టర్ అక్కిరాజు సుందరరామకృష్ణ, తదితరులు సాహిత్య రంగానికి తుమ్మల, ముదిగొండ చేసిన సేవలు బహుదా ప్రశంసనీయమని శ్లాఘించారు. తనకు జరిగిన సత్కారానికి శివప్రసాద్ స్పందిస్తూ.. మహాత్ముడు మెచ్చిన మహాకవి తుమ్మల అని ప్రస్తుతించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో, ముఖ్యంగా కృష్ణానది తీరంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై మాదిరిగా తెలుగు సంస్కృతి, భాష వికాసానికి కృషిచేసిన మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. నవ్యాంధ్ర అసెంబ్లీకి రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు నచ్చిమెచ్చిన ‘సుధర్మ’ పేరు పెట్టాలని ముఖ్యమంత్రికి సభాపూర్వకంగా సూచించారు. అనేక మంది సాహితీవేత్తలు, భాషాప్రియులు సభలో పాల్గొన్నారు.

చిత్రం..ఆచార్య ముదిగొండ శివప్రసాద్‌కు తుమ్మల కళాపీఠం
సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న దృశ్యం