తెలంగాణ

స్పీకర్‌దే ఆ అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: శాసనసభలో బిజినెస్ రూల్స్ కింద స్పీకర్‌కు ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రత్యేక గ్రూపుగా గుర్తించడం, సీట్ల కేటాయింపు, సీట్ల అమరిక విధానం అధికారాలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి హైకోర్టుకు తెలిపారు. టిఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది టిడిపి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు తాము ఇచ్చిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని కోరుతూ సింగిల్ జడ్జి కోర్టులో టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గతంలో పిటిషన్ దాఖలు చేశారు. మూడు నెలల్లోగా స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జి కోర్టు సెప్టెంబర్ 21వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. టిఆర్‌ఎస్ లెజిస్లేచర్ పార్టీతో టిడిపి లెజిస్లెచర్ పార్టీ విలీనమైనట్లు తెలంగాణ అసెంబ్లీ ఒక బులెటిన్‌ను మార్చి 10వ తేదీన జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ అసెంబ్లీ సచివాలయం హైకోర్టు ధర్మాసనం ఎదుట అపీల్ చేసింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ, నిబంధనల మేరకు టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు బిజినెస్ రూల్స్‌కింద స్పీకర్ సీట్లు కేటాయించారన్నారు. రామదాస్ అథ్లెవాలే వర్సెస్ కేంద్రప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు కూడా కోర్టుల పరిధిలోకి శాసనసభ రాదని, అంతర్గత ప్రొసీడింగ్స్‌తో సంబంధం లేదని పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అనంతరం హైకోర్టు ధర్మాసనం ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదావేసింది.