తెలంగాణ

సిఎం దత్తత గ్రామాలలో నత్తనడకన అభివృద్ధి పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, డిసెంబర్ 15: సిఎం దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలలో గురువారం సిఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి పర్యిటించి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈనెల 23న గృహప్రవేశాల తెదీని ఖరారు చేసినప్పటికీ వౌలిక సదుపాయాల కల్పనలో అధికారుల పనితీరుపై వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. డిసెంబర్ 15 నాటికి అన్ని పనులు పూర్తి చేసి లబ్దిదారులకు ఇళ్లు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదేశించినా అధికారులు మాత్రం పనులు పూర్తి చేయటంలో నిర్లక్ష్యం వహించటంపై అగ్రహం వ్యక్తం చేశారు. రెండు గ్రామాలలో మూడు జోన్లుగా విభజించి జిల్లా స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించిన పనులు పూర్తికాకపోవటం పట్ల అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. మిగిలింది ఎనిమిది రోజులు మాత్రమే జోన్లవారీ కూలీల సంఖ్యను పెంచి పనులు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రాంరెడ్డిని ఆదేశించారు. ఇప్పటికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజి, ఇళ్ల ప్రహరీలు, మొక్కలు నాటటం, సిసి రోడ్ల నిర్మాణం లాంటి పనులు పూర్తికాకపోగాగ అధికారులకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పనుల్లో పురోగతి సాధించాలని సూచించారు. పనుల వేగవంతానికి గ్రామస్థుల సహకారం తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపివో సురేష్‌బాబు, బిసి కార్పొరేషన్ ఇడి రాంరెడ్డి, ఆర్డీవో విజేందర్ రెడ్డి, తహశిల్దార్ పరమేశం, విడిసి అధ్యక్షులు కిష్టారెడ్డి, రాంచంద్రం, సర్పంచ్‌లు బాల్‌రెడ్డి, భాగ్య ఎంపిటీసి పాల్గొన్నారు.