తెలంగాణ

నోట్ల రద్దుపై తప్పించుకు తిరుగుతున్న ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంగునూరు, డిసెంబర్ 15: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దుతో ప్రజలు, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, దీనిపై ప్రధాని మోదీ పార్లమెంట్‌లో మాట్లాడకుండా తప్పించుకు తిరుగుతున్నారని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంత రావు అన్నారు. గురువారం మండలంలోని పాలమాకుల సిండికేట్ బ్యాంకుముందు డబ్బుల కోసం క్యూలో నిలబడ్డ ప్రజలు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ నేతలతో కలిసి బ్యాంకుముందు నోటికి నల్లగుడ్డ కట్టుకొని సుమారు 2గం. సేపు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం నోట్లు రద్దు చేసి నెలన్నరైనా కొత్తనోట్లు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నోట్ల రద్దు పై రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీకి చెప్పకుండా దాచారని, ఆయనకూడా ప్రతిపక్షాల పై కొనసాగించుకోవడం సరికాదన్నారు. రైతులకు 2వేలుమాత్రమే బ్యాంకుల్లో ఇస్తు పెద్దలకు మాత్రం వేలకువేలు ఏలా ఇస్తారని ప్రశ్నించారు. దీని పై త్వరలో ఆర్‌బిఐ ముందు ధర్నా చేస్తామన్నారు.కేంద్రం నోట్లు రద్దుచేయగానే మోదీని విమర్శించిన సిఎం కెసిఆర్ ఢిల్లీకి పోయివచ్చాక నోరుమెదపడం లేదన్నారు. నోట్లకష్టాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే నగదురహితమంటు ప్రజలను మభ్యపెడుతోందని అన్నారు. ప్రజల్లోకిపోయి తెలుసుకోకుండా హైద్రాబాద్‌లో ఉంటే వారి కష్టాలు కెసిఆర్‌కు ఏలా తెలుస్తాయన్నారు.