తెలంగాణ

ఎబివిపి అధ్యక్షుడిగా చెన్న కృష్ణారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: ఎబివిపి తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా డాక్టర్ చెన్న కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా ఎల్ అయ్యప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి మసాడి బాపురావు ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 24 నుండి జరిగే ఎబివిపి జాతీయ మహాసభల్లో వీరు బాధ్యతలు చేపడతారు. చెన్నకృష్ణారెడ్డి మెదక్ జిల్లాకు చెందిన వారు కాగా, ఉస్మానియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్శిటీలోని సమస్యలు, అధ్యాపకుల నియామకాలు, విసిల రిక్రూట్‌మెంట్, మెస్ ఛార్జీల కోసం జరిపిన విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు.
అయ్యప్ప పాలమూరు జిల్లాకు చెందిన వారు. ప్రస్తుతం ఎల్‌బి నగర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎమ్సెట్ కుంభకోణం బయటకి తీయడంలో క్రియాశీల పాత్ర పోషించారు. అలాగే నీట్ సీట్ల కేటాయింపులో అవకతవకలపై కూడా ఉద్యమించారు.

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అనిల్ ఎన్‌కౌంటర్
చీరాల/చీరాలరూరల్, డిసెంబర్ 16: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తేళ్ల అనిల్‌కుమార్(44) ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో శుక్రవారం పోలీసు ఎన్‌కౌంటర్లో మృతి చెందాడు. అతని స్వస్థలం ప్రకాశం జిల్లా చీరాల మండలం విజయనగర్ కాలని. అతను పదో తరగతి వరకు స్థానిక ఎ ఆర్ ఎం ఉన్నత పాఠశాలలో చదివాడు. అనంతరం 1992లో ఇల్లు వదిలి ఉద్యమ బాట పట్టాడు. స్థానిక ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ అనిల్ అంచెలంచెలుగా ఎదిగి ఎఒబి కేంద్ర కమిటి సభ్యుడుగా, అధికార ప్రతినిధిగా పనిచేశాడని తెలిపారు. 2014లో అనిల్‌ను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారన్నారు. కండిషన్ బెయిల్‌పై అతను విడుదలైనప్పటికీ కోరాపుట్ పోలీసులు అతన్ని బయటకు వెళ్లనివ్వకుండా ఆంక్షలు విధించినట్లు ఆరోపించారు. పోలీసులే అతన్ని ఎన్‌కౌంటర్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
భీమా ప్రాజెక్టుకు కేంద్రం ధీమా
రూ.54 కోట్లు మంజూరు తుది దశ పనులకు చేయూత

మహబూబ్‌నగర్, డిసెంబర్ 16: జలయజ్ఞం ప్రాజెక్టులలో ఒకటైన రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం పనులు చివరిదశకు చేరుకోగా నిధుల కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్న దశలో కేంద్రం నుంచి భరోసా లభించింది. తాజాగా కేంద్రప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీంతో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఏర్పడింది. ప్రాజెక్టుకు సంబంధించిన పనులు తుది దశలో ఉన్నందున ప్రస్తుతం కొంత నిధులు మంజూరు చేస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం ఏకంగా రూ.54 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో భీమా ప్రాజెక్టుకు ఊతం కల్పించింది.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 15 మండలాల్లో 2.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును సత్వర సాగునీటికి ప్రయోజన పథకం (ఎఐబీపీ) కింద కేంద్రం 90 శాతం నిధులను కేటాయిస్తుంది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రూ.2158.40 కోట్ల అంచనాలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు అదనపు నిధుల చెల్లింపులు కూడా ఇప్పటివరకు జరిగాయి. పెరిగిన ఖర్చులతో మరో రూ.500 కోట్ల వ్యయం అధికం అయ్యింది. అందులో భాగంగా మరోమారు ప్రస్తుతం కేంద్రం ఎఐబీపీ పరిధిలో ఉన్న ఈ ప్రాజెక్టుకు మరో రూ.54కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఇచ్చిన నిధులు పునరావాసం, భూసేకరణ, ఈ ప్రాజెక్టు పరిధిలో కొనసాగుతున్న శంకరసముద్రం జలాశయం లాంటి పనులకు ఉపయోగించనున్నారు. కేంద్రం ఇచ్చిన సహయంతో భీమా ప్రాజెక్టు పనులు పుంజుకోనున్నాయని ప్రాజెక్టు ఎస్‌ఇ భద్రయ్య ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు.