తెలంగాణ

కాలుష్య కారక పరిశ్రమలపై నిషేధం వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16:తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు వినియోగించే నీటి విషయంలో ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబించాలని, కాలుష్యవ్యాప్తికి దోహదపడే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరించింది. శుక్రవారం ఇక్కడ తెలంగాణ సిఐఐ విభాగం ‘పారిశ్రామిక నీటి వినియోగం, యాజమాన్యం’ అంశంపై నిర్వహించిన సదస్సులో మండలి పర్యావరణ శాస్తవ్రేత్త డాక్టర్ ఎన్ రవీందర్ మాట్లాడుతూ, పరిశ్రమలు వాల్టా చట్టానికి కట్టుబడి ఉండాలని, నీటి యాజమాన్య పద్ధతులను అమలు చేయాలని కోరారు.
పరిశ్రమల యాజమాన్యాలు ఎప్పటికప్పుడు కాలుష్య నివారణ చర్యలను సమీక్షించుకోవాలన్నారు. కాలుష్య రహిత వాయువు, నీరు, వ్యర్ధ పదార్ధాలకు ఆధునిక టెక్నాలజీ సేవలను వినియోగించుకోని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సిఐఐ (్భరతీయ పరిశ్రమల సమాఖ్య) డిప్యూటీ డైరెక్టర్ ఎస్ రఘుపతి మాట్లాడుతూ ప్రస్తుతం నీటి వినియోగంపై వత్తిడి పెరిగిందని, నీటి పొదుపుపై కూడా పరిశ్రమలు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పరిశ్రమలు కాలుష్య నివారణకు క్రియాశీలకంగా వ్యవహరిస్తాయన్నారు.
ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా వినియోగిస్తున్న నీటిలో 35 శాతం వరకు ఆదా చేయవచ్చన్నారు. సిఐఐ తెలంగాణ విభాగం కన్వీనర్ ఎన్ నరసింహన్ మాట్లాడుతూ, పర్యావరణ పరంగా ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు. వ్యర్ధ జలాల యాజమాన్య పద్ధతుల్లో ఆధునిక విధానాలను వివరించారు. కో కన్వీనర్ కెవిఎస్‌ఎన్ రాజు నీటి వనరుల గురించి వివరించారు.