తెలంగాణ

సింగిల్ పర్మిట్‌కోసం ఏపితో చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: జిల్లాల్లో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నామని, హైదరాబాద్‌లో మహిళా డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రవాణా మంత్రి పి మహేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ వాహనాలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో తిరిగేందుకు సింగిల్ పర్మిట్ అనుమతి ఉందని, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ పర్మిట్ కోసం ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రితో చర్చిస్తున్నట్టు మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇంతకుముందు ఒకసారి చర్చించినట్టు, వారం రోజుల్లో మరోసారి సమావేశం నిర్వహించి సింగిల్ పర్మిట్ విధివిధానాల రూపకల్పన చేయనున్నట్టు మహేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం శాసన సభలో వివిధ పార్టీల సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రశ్నోత్తరాలలో మంత్రి ఈ విషయం తెలిపారు. బ్యాటరీలతో నడిచే వాహనాలు, గ్యాస్, సోలార్‌తో నడిచే వాహనాలకు ఐదేళ్ల కోసం పన్ను రాయితీలు అందించామని చెప్పారు. డ్రైవింగ్ శిక్షణకు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 66 భారీ మోటారు డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయని తెలిపారు. సిరిసిల్లలోని మండేపల్లి గ్రామంలో ఒక డ్రైవింగ్, శిక్షణ, పరిశోధన సంస్థను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్టు మంత్రి చెప్పారు.