తెలంగాణ

ఉద్యోగులు, జర్నలిస్టులకు వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: తెలంగాణ ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య బీమా పథకం అమలుకోసం 13 కార్పొరేట్ ఆస్పత్రులకు ప్రభుత్వానికి మధ్య శనివారం ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు శనివారంనుంచే కార్పొరేట్ ఆస్పత్రుల్లో సేవలు పొందవచ్చు.కార్పొరేట్ ఆస్పత్రులు, ప్రభుత్వం మధ్య ఇంతవరకూ ఒప్పందం కుదరకపోవడంతో పలు ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్స అందించేందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మూడు నెలలుగా ప్రభుత్వానికి, ఆస్పత్రుల యాజమాన్యాలకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. చర్చలు శనివారం కొలిక్కిరావడంతో ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇకపై ఆరోగ్య శ్రీ పథకం కింద ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు కార్పొరేట్ ఆస్పత్రిలో సేవలు అందనున్నాయి. ఇతర ఆస్పత్రులతోపాటు రాష్ట్రానికి చెందిన 13 ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య చికిత్స పొందే అవకాశం లభించింది.ఖైరతాబాద్‌లోని ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల ఆరోగ్య శ్రీ సేవల కోసం వెల్‌నెస్ సెంటర్‌ను వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి శనివారం ప్రారంభించారు. ఔట్ పేషెంట్ సేవలు కూడా ఇక్కడ లభిస్తాయి.