తెలంగాణ

పగిలిన ఎల్లంపల్లి పైపులైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధర్, డిసెంబర్ 17: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి వద్ద ఎల్లంపల్లి పైపులైన్ పగిలింది. దీంతో నీరంతా వృధాగా పోతోంది. వందమీటర్ల ఎత్తుతో ఎగిసిపడుతోంది. మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్‌లోకి వస్తున్న ఎల్లంపల్లి పైపులైను ఎయిర్ వాల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ద్వంసం చేయడంతో పెద్దఎత్తున నీరు ఎగిసి పడుతోంది. శనివారం తెల్లవారుజామున గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి గ్రామ శివారులో గల ఎల్లంపల్లి పైపులైను ఎయిర్‌వాల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో నారాయణపూర్ రిజర్వాయర్‌లోకి నీరు పోకుండా ఎయిర్‌వాల్ ద్వారా నీరు సర్వారెడ్డిపల్లి శివారులోగల పంట చేలల్లో నుండి గుండి చెరువులోకి చేరుతోంది. అటు పొలాలు జలమయమయ్యాయి. చొప్పదండి మండలం రేవెల్లి గ్రామానికి చెందిన రైతులు గుండి చెరువు నిండడం ద్వారా వరద నీరు మత్తడి ద్వారా తమ చెరువులోకి చేరుతుందనే భావనతో కొందరు ఈ చర్యకు పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఎల్లంపల్లి పైపులైను ఎయిర్‌వాల్ పగిలిన సమాచారం అందుకున్న నీటిపారుదల శాఖ సిఇ అనిల్‌కుమార్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి జరిగిన ఘటనపై వివరాలు సేకరించారు.