తెలంగాణ

ఎన్‌ఆర్‌ఐ భూకబ్జా ఘటనలో సబ్‌రిజిస్ట్రార్‌పై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, డిసెంబర్ 17: ప్రవాస భారతీయుడు దీపక్‌కాంత్ వ్యాస్‌కు చెందిన సుమారు రూ.10 కోట్ల విలువ చేసే 24.01 ఎకరాల భూమిని తప్పుడు రికార్డులతో రిజిస్ట్రేషన్ చేసిన సంఘటనతో సంబంధం ఉన్న నల్లగొండ జిల్లా చౌటుప్పల్ సబ్‌రిజిస్ట్రార్ తిరుమల్‌రావుపై శనివారం కేసు నమోదైంది. బీబీనగర్ మండలం రాఘవపురం శివారులో ఉన్న ఎన్‌ఆర్‌ఐ వ్యాస్ భూమిని కొంతమంది ముఠాగా ఏర్పాడి తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ సంఘటనలో 21 మందిపై కేసు నమోదు చేసి ఇప్పటికే 20 మందిని అరెస్ట్ చేశారు. రవీందర్డ్డ్రి అనే వ్యక్తి పరారీలో ఉన్నారు. కాగా, తప్పుడు ధృవీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసిన సంఘటనలో చౌటుప్పల్ సబ్‌రిజిస్ట్రార్ అక్రమాలకు పాల్పడి రూ.లక్ష లంచం తీసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలావుండగా, అతనిపై కేసు నమోదు కావడంతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. సబ్‌రిజిస్ట్రార్‌ను అదుపులోకి తీసుకునేందుకు సిఐ నవీన్‌కుమార్ సారధ్యంలో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

ఇంద్ర బస్సులో పొగలు
మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 17: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీసీ డిపోకు చెందిన ఇంద్ర ఎసి బస్సులో శనివారం మధ్యాహ్నం పొగలు వచ్చాయ. హైదరాబాద్ నుండి వస్తున్న ఇంద్ర రాజధాని బస్సులో సుమారు 15 మంది ప్రయాణికులున్నారు. పొగలు వస్తున్న విషయాన్ని తెలుసుకున్న ప్రయాణికులు భయానికి లోనయ్యారు. మిర్యాలగూడ పట్టణంలోకి చేరుకున్న బస్సులో నుండి పొగలు రావడం, ముందుకు సాగకపోవడంతో డ్రైవర్ రాంబాబు బస్సును స్థానిక తడకమళ్ల చౌరస్తా వద్ద నిలిపివేసి చూడగా వెనుక టైరు వద్ద పొగలు రావడాన్ని గమనించాడు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేయగా వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పొగలు రాకుండా నీటితో ఆపేశారు. బస్సు బ్రేక్ లైనర్స్ పట్టుకోవడం వల్లనే పొగలు వచ్చి ఉంటాయని డ్రైవర్ రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు.