తెలంగాణ

చట్ట సభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎమ్మెల్యే, జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణలో బిసిల జనాభా 60 శాతం ఉంటే 119 ఎమ్మెల్యేల్లో 19 మంది బిసిలు, ఆంధ్రాలో బిసిల జనాభా 52 శాతం ఉంటే, 175 ఎమ్మెల్యేల్లో 33 మంది బిసిలు ఉన్నారన్నారు. దేశంలోని 2600 బిసి కులాల్లో 2550 కులాలవారు పార్లమెంటులో అడుగుపెట్టలేదన్నారు. అసెంబ్లీ, పార్లమెంటులో అడుగుపెట్టని కులాలకు ఆంగ్లో ఇండియన్స్ లాగా నామినేటడ్ పద్ధతిపై ఎంపి, ఎమ్మెల్యేలుగా నామినేట్ చేయాలని కోరారు. ఆదివారం ఇక్కడ జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద భారీ ఎత్తున బహిరంగ సభ, ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంటులోని 36 రాజకీయ పార్టీలు ఉన్నాయని, ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా పార్లమెంటులో బిసిల పక్షాన నోరెత్తి మాట్లాడడం లేదన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వాలు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న అభ్యంతరాలేమిటని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టారని, కాని బిసిలకు అన్యాయం చేశారన్నారు. కేంద్రం సేకరించిన గణాంకాల ప్రకారం 69 సంవత్సరాల్లో పార్లమెంటు, అసెంబ్లీ సభ్యుల్లో బిసిల ప్రాతినిధ్యం 12 శాతం దాటలేదన్నారు. 56 శాతం జనాభా ఉన్న బిసిలకు 12 శాతం ప్రాతినిధ్యం దాటలేదంటే రాజకీయ రిజర్వేషన్లు పెట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 29 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల్లో బిసిల నుంచి ఒక్క పార్లమెంటు సభ్యుడు లేరన్నారు. ఉద్యోగ, పాలన రంగాల్లో బిసిల ప్రాతినిధ్యం 9 శాతం దాటలేదన్నారు. బిసిలకు ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించకపోవడం జాతీయ స్ధాయిలో ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయకపోవడం, కేంద్రబడ్జెట్‌లో బిసిల సంక్షేమానికి నిధులు కేటాయించకపోవడం, ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయకపోవడం, పార్లమెంటులో బిసి బిల్లు ప్రవేశపెట్టకపోవడం అన్యాయమన్నారు.

చిత్రం..బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య