తెలంగాణ

తమిళనాడు తరహాలో బిసి రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలో బిసి సామాజిక వర్గాల అభ్యున్నతికి తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు కల్పించటానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం నిజాం కళాశాల మైదానంలో జరిగిన ముదిరాజ్‌ల సింహగర్జన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. గత ప్రభుత్వాలు ముదిరాజ్‌లను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేశారని విమర్శించారు. బిసిల సంక్షేమానికే సిఎం కెసిఆర్ బిసి కమిషన్‌ను వేశారని అన్నారు. ముదిరాజ్‌లను బిసి డి నుండి బిసి ఎ జాబితాలోకి చేర్చాలన్నది న్యాయమైన డిమాండ్ అన్నారు. జివో వచ్చి కోర్టులో ఆగిపోయిన దానిని తిరిగి పునరుద్ధరిస్తుందని అన్నారు. ముదిరాజ్‌వ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం తవ్వి వృధాగా ఉన్న కాలువల్లో సైతం చేపలు పెంచే ప్రణాళిక చేస్తున్నారంటే ముఖ్యమంత్రి మనర గురించి ఎంత ఆలోచిస్తున్నారో తెలుస్తుందన్నారు. ముదిరాజ్‌ల సమస్యలు తీర్చడానికి ఎల్లప్పుడు ముందుంటానని హామీనిచ్చారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహసభ అధ్యక్ష, కార్యదర్శులు డా.బండ ప్రకాశ్ ముదిరాజ్, చొప్పరి శంకర్ ముదిరాజ్, గ్రేటర్ అధ్యక్షుడు లక్ష్మినారాయణ పాల్గొన్నారు.