తెలంగాణ

మహిళా పారిశ్రామిక వేత్తలకు పెట్టుబడిలో 30 శాతం రిబేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి కె. తారకరామారావు తెలిపారు. రాష్ట్ర శాసనమండలిలో సోమవారం జరిగిన స్వల్పవ్యవధి చర్చకు సమాధానం ఇస్తూ, హైదరాబాద్ సమీపంలోని సుల్తాన్‌పూర్‌లో 50 ఎకరాల భూమిని మహిళాపారిశ్రామిక వాడ కోసం కేటాయించామని తెలిపారు. భూమి కేటాయింపులో 30 శాతం రిబేటు ఇస్తామని వెల్లడించారు. బ్యాంకర్లు కూడా మహిళలకు రుణాలు ఇవ్వాడానికి సముచిత ప్రాధాన్యత ఇస్తుండటంతో మహిళాపారిశ్రామిక వేత్తలకు మంచి అవకాశాలు కల్పించినట్టవుతోంది. ఎస్‌సి, ఎస్‌టిలకు కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహం అందిస్తున్నామని కెటిఆర్ తెలిపారు. 167 కోట్లు ఎస్‌సిలకు, 90 కోట్లు ఎస్‌టిలకు ఈ సంవత్సరం విడుదల చేశామన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలకు పరిశ్రమలు ఏర్పాటైన నాటి నుండి రెండేళ్ల మారటోరియం విధిస్తున్నామని, 33 శాతం సబ్సిడీ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఉద్యోగాల్లో స్థానికులకే పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు.