తెలంగాణ

నిందితులపై నిర్భయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీణవంక/ హుజూరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచార ఘటనలో ఆదివారం మరో మైనర్ బాలుడిని పోలీసులు అరెస్టు చేసి జువైనల్‌కు తరలించారు. దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిపిన నిందితులు ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు. కాగా ఈ సంఘటనపై బాధితురాలిని పరామర్శించేందుకు ఆదివారం చల్లూరుకు వెళ్లిన పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. అదే క్రమంలో బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్ర అర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కాన్వాయ్‌ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి ఈటెల స్పందిస్తూ బాధితురాలికి న్యాయం చేస్తామని, దోషులను శిక్షిస్తామని భరోసా ఇచ్చారు. వీణవంక ఎస్‌ఐను సస్పెండ్ చేయాల్సిందిగా జిల్లా ఎస్పీని మంత్రి ఈటెల ఆదేశించారు. ఆందోళనకారులను శాంతింపజేసి బాధితురాలిని పరామర్శించారు. ఆదివారం అరెస్టు చేసిన మైనర్ బాలుడిని కరీంనగర్ జువైనల్ కోర్టుకు తరలించామని, అలాగే మరో ఇద్దరు నిందితులు వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని హుజూర్‌నగర్ డిఎస్పీ రవీందర్‌రెడ్డి తెలిపారు. నిందితులపై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్టు డిఎస్పీ తెలిపారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం షీ టీమ్‌లను ఏర్పాటు చేసిందని, ఈ వ్యవస్థను గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు.