తెలంగాణ

శ్రీశైలం రిజర్వాయర్‌లో జెన్‌కో ఎఇ దంపతుల మృతదేహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం ప్రాజెక్టు, డిసెంబర్ 19: శ్రీశైలం డ్యాం ఎగువ టన్నల్ సమీపంలోని నీటి ఒడ్డున సోమవారం రెండు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అమ్రాబాద్ ఎస్సై జహంగీర్ యాదవ్ వాటిని స్వాధీనం చేసుకున్నారు. మృతులను ఈగలపెంట పనిచేస్తున్న జెన్‌కోలో ఎఇ టి.క్రాంతికుమార్ (30), ఆయన భార్య సంయుక్త (27)గా గుర్తించారు. వీరిద్దరూ తరుచుగా ద్విచక్ర వాహనంపై టన్నల్ సమీపంలోని నీటి ఒడ్డుకు వచ్చి కొద్దిసేపు కూర్చొని వెళ్లేవారని, శనివారం కూడా వారు రావడాన్ని తాము గమనించామని, ఆ రోజు నుంచి ద్విచక్ర వాహనం అక్కడే ఉందని స్థానికులు తెలిపారు. సోమవారం ఉదయం వారిద్దరి మృతదేహాలు నీటి ఒడ్డున కనిపించాయని తెలిపారు. వీరికి ఇటీవలనే వివాహం జరిగిందని, వారు హైదరాబాద్‌కు చెందిన వారిగా తెలిసిందన్నారు. వారిద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవారని స్నేహితులు, ఇరుగుపొరుగు వారు తెలిపారు. ప్రమాదవశాత్తు భార్య నీటిలో పడిపోగా కాపాడేందుకు వెళ్లిన భర్త కూడా చనిపోయి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయ. మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం అమ్రాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా రాలేదని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

చిత్రం..శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ఒడ్డున భార్యాభర్తలు క్రాంతి కుమార్, సంయుక్త మృతదేహాలు