తెలంగాణ

ఎస్‌టిలకు ఉచిత కోచింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: షెడ్యూల్డ్ తెగలకు (ఎస్‌టి) చెందిన అభ్యర్థులకు సివిల్స్ పరీక్షల్లో పాల్గొనేందుకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. డాక్టర్ వైఎస్‌ఆర్ స్టడీ సర్కిల్ వీరికి కోచింగ్ ఇస్తుందని ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల ఆధారంగా 300 మంది అభ్యర్థులను ఎంపిక (షార్ట్‌లిస్టెడ్) చేశారు. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 300 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్టు ప్రకటించారు. బాల్‌పాయింట్‌పెన్, పెన్సిల్, ఎరేజర్, నాలుగుపాస్‌పోర్ట్‌సైజ్ ఫోటోలు, ఒరిజినల్ సర్ట్ఫికెట్లతో అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులేవీ పరీక్షాహాలులోకి అనుమతించమని స్పష్టం చేశారు. ఈ నెల 23 న హైదరాబాద్‌లోని డాక్టర్ లక్ష్మయ్య స్టడీసర్కిల్ కార్యాలయంలో జరిగే పరీక్షకు గంట ముందే హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలు, హాల్‌టిక్కెట్లు స్టడీసర్కిల్ వెబ్‌సైట్ నుండి తీసుకోవచ్చని వివరించారు.