తెలంగాణ

‘గరీబ్ కళ్యాణ్ యోజన’ను సద్వినియోగం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: నల్లధనాన్ని వెలికితీసేందుకు 1000, 500 నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం నల్లకుబేరుల వద్దనున్న బ్లాక్ మనీని స్వచ్చంధంగా వెల్లడించేందుకు వీలుగా ప్రదాన మంత్రి ప్రకటించిన ‘ప్రదాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ స్కీంను సద్వినియోగం చేసుకోవాలని ఆదాయపన్ను ప్రధాన కమిషనర్ సుశీల్‌కుమార్ సూచించారు. సోమవారం రెడ్‌హిల్స్‌లోని ఇన్‌కం ట్యాక్స్ టవర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదాయపన్ను శాఖ ప్రతి బ్యాంకు ఖాతా, ప్రతి లావాదేవీకి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించిందని, అయినా లెక్కల్లో చూపని నగదును జమ చేసుకునేందుకు అవకాశమిస్తున్నట్లు తెలిపారు. లెక్కల్లోనికి రాని సొమ్మును స్వచ్ఛందంగా వెల్లడి చేసే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని కూడా సుశీల్‌కుమార్ తెలిపారు. ఈరకంగా జమ చేస్తున్న నగదులో యాభై శాతం అన్ని రకాల పన్ను, సర్‌ఛార్జీలు, జరిమానాలు స్వీకరించి, మిగిలిన డిపాజిట్ నగదులో 25 శాతాన్ని ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన బాండ్‌లలో వడ్డీ రహితంగా నాలుగు సంవత్సరాల పాటు నిర్బంద కాలవ్యవధికి డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోని పక్షంలో 85 శాతం చెల్లించాల్సి ఉంటుందని, ఇలాంటి సందర్భాల్లో నల్లధనం కల్గి ఉన్న వారికి దాదాపు ఏడేళ్ల పాటు జైలు శిక్ష, జరిమానాతో పాటు ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కొవల్సి ఉంటుందని తెలిపారు.
రూ. 280 కోట్ల నగదు స్వాధీనం
కేంద్రం పెద్దనోట్ల రద్దును ప్రకటించిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపన్ను శాఖ 12తనిఖీలు నిర్వహించి లెక్కల్లో చూపని రూ. 280కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు, ఇక లెక్కల్లో ఉన్న మరో రూ.11కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు తెలిపారు.

చిత్రం..రెడ్‌హిల్స్‌లోని ఐటి భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న ఐటి చీఫ్ కమిషనర్ సుశీల్‌కుమార్