ఆంధ్రప్రదేశ్‌

ఉచిత ఇసుకపై విధివిధానాల రూపకల్పన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుకపై విధి విధానాల రూపకల్పన చేస్తున్నామని, వాటిని అతి త్వరలో వెల్లడిస్తామని రాష్ట్ర భూగర్భ, గనులు, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆదివారం ఆమె విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల అవసరాలను, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుక ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారన్నారు. ఇది ఏవిధంగా అమలుచేయాలన్న అంశంపై కలెక్టర్లు, మంత్రులు, ఇతర ముఖ్య అధికారులతో ఇప్పటికే ముఖ్యమంత్రి చర్చించారని, ప్రిడాయ్‌తో కూడా చర్చించి, ఇసుక ఉచితంగా అందిస్తారన్నారు. రాష్ట్ర ఆదాయం కన్నా ప్రజల ఇబ్బందులు తీర్చాలనే దేశంలో ఎవరూ తీసుకోని నిర్ణయం ప్రభుత్వం తీసుకుందన్నారు.
అహంకారమే జగన్‌కు దెబ్బ
ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని అహంకారమే దెబ్బతీస్తోందని మంత్రి సుజాత విమర్శించారు. జగన్ ప్రభుత్వానే్న పడగొట్టేస్తామనడం అప్రజాస్వామికమని, దీంతో ప్రజల్లో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. అందుకే ఆయన పార్టీలోని ఎమ్మెల్యేలు వారంతట వారే టిడిపిలోకి వచ్చేస్తున్నారన్నారు. టిడిపి ఎవరినీ బలవంత పెట్టడం లేదని, వారి నియోజకవర్గాల అభివృద్ధిని, రాష్ట్భ్రావృద్ధిని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్రం కోసం కష్టపడుతున్న చంద్రబాబునాయుడు నాయకత్వంలో పనిచేయాలని వస్తున్నారన్నారు. వైసిపిలో రోజా వంటి కొంతమంది నేతలు తమ స్థాయికి తగిన విమర్శలు చేయడంలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేష్‌పై విమర్శలు చేయడం దారుణమన్నారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పినా వారి వైఖరిలో మార్పు రావడంలేదన్నారు.