తెలంగాణ

టోక్యో తరహాలో క్లీనర్ అథారిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: హైదరాబాద్ నగర పరిధిలో వాయు, నీటి, శబ్ద కాలుష్యం పెరుగుతున్న మాట వాస్తవమేనని ఐటి, మున్సిపల్ పరిపాలన మంత్రి కె తారకరామారావు మంగళవారం శాసనసభలో చెప్పారు. వాయు నాణ్యత సూచిక (ఎక్యుఐ) ప్రకారం చుట్టూ వ్యాపించిన వాయువునాణ్యత సముచితం, సంతృప్తికరం లేదా ఓ మోస్తరు నాణ్యతా శ్రేణిలో ఉందని చెప్పారు. అక్బరుద్దీన్ ఒవైసీ, ముంతాజ్ అహ్మద్‌ఖాన్, కౌసర్ మొయినుద్దీన్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ త్వరలోనే నగర ఎమ్మెల్యేలతో ఒక సమావేశం నిర్వహించి అభిప్రాయాలను స్వీకరించి తగు చర్యలు చేపడతామని చెప్పారు. టోక్యోలో ఉన్నట్టు హైదరాబాద్‌లోనూ క్లీనర్ అథారిటీని ప్రతిపాదించే ఆలోచన ఉందని తెలిపారు. కాలుష్యకారకమైన 1,545 పరిశ్రమలను గుర్తించామని, వాటిని తరలించే బదులు జలశుద్ధి యంత్రాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. 1240 కోట్లతో సీవరేజి ప్లాంట్‌లను నెలకొల్పుతున్నామని తెలిపారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షించిన 19 చెరువుల్లో నీటి నాణ్యత.. ప్రమాణాలను చేరుకోలేకపోతోందని అన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని 11 వివిధ ప్రదేశాల్లో టిఎస్‌పిసిబి వాస్తవిక ధ్వని పర్యవేక్షణ స్టేషన్లను కలిగి ఉందని, పర్యవేక్షణ సమాచారం ప్రకారం 15 శాతం వరకూ ధ్వని ప్రమాణాలను మించి ధ్వని స్థాయిలను కనుగొనడం జరిగిందని అన్నారు. వాయు కాలుష్యానికి సంబంధించి, వాయు కాలుష్య నియంత్రణ కోసం భాగస్వామ్య శాఖలన్నీ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాయని, నీటి కాలుష్యానికి సంబంధించి, శుద్ధి చేయని మురుగునీటి విడుదల వల్ల నీరు కలుషితం అవుతోందని చెప్పారు. శబ్ద కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం జీవో 172ను జారీ చేసిందని పేర్కొన్నారు.