తెలంగాణ

కమిషన్ వస్తుందనుకుంటే.. చిత్తుకాగితాలే దక్కాయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 20: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కమీషన్ కోసం కక్కుర్తిపడ్డ వారిని పెద్దనోట్ల మార్పిడి ముఠా మోసగించింది. మిర్యాలగూడకు చెందిన టైలర్ వహీద్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుపగా 8.5 లక్షల రూపాయల కొత్త కరెన్సీతో పరారైన వ్యక్తి గోపినాథ్‌రెడ్డి, మధ్యవర్తిత్వం వహించిన అన్వర్‌ను అరెస్టు చేసినట్టు ఒన్‌టౌన్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ డి.బిక్షపతి మంగళవారం తెలిపారు. వహీద్‌కు రాంబాబు, రవి, ధర్మానాయక్, వెంకటేష్ సుమారు 8.50 లక్షల కొత్త కరెన్సీ నోట్లు ఇవ్వగా 15 శాతం కమిషన్‌కు పాత నోట్లు తీసుకుని కొత్తవి ఇప్పిస్తానని ఓకలాల్‌వాడకు చెందిన అన్వర్ అనడంతో రంగారెడ్డి జిల్లా రాజేందర్‌నగర్ మండలం శివరాంపల్లికి చెందిన గోపినాధ్‌రెడ్డి, నేరేడుచర్లకు చెందిన జనార్ధన్, తూర్పు గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన శ్రీనివాస్ మరో ముగ్గురు నోట్ల మార్పిడి తతంగం నిర్వహించి కొత్త నోట్లు 8.5 లక్షలతో పరారై పాతనోట్లు ఇవ్వకుండా వాటి స్థానంలో చిత్తు కాగితాలు ఉంచారని తెలిపారు. ఈ తతంగానికి అంతటికీ మధ్యవర్తిగా ఉన్న అన్వర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా గోపినాధ్‌రెడ్డి గురించి వివరించాడని, అతన్ని అదుపులోకి తీసుకున్నామని ఆయన అన్నారు. ఇంకా ఐదుగురిని విచారించవలసి ఉన్నదని తెలిపారు. వారి నుండి 8.5 లక్షల రూపాయల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకోవాల్సి ఉందని ఇన్స్‌పెక్టర్ తెలిపారు. కరెన్సీ మార్చే సమయంలో ఒక సూట్ కేసును నిందితుడు గోపినాధ్‌రెడ్డి తీసుకువచ్చాడని, నూతన కరెన్సీ నోట్లు ఇచ్చిన అనంతరం ఆ బ్యాగును సూట్‌కేసులో ఉంచుకున్నాడని తెలిపారు. అదే పాత కరెన్సీ నోట్ల బ్యాగు కారులో ఉందని చెప్పి అప్పటివరకు వారిచ్చిన కరెన్సీ నోట్ల బ్యాగు మీవద్దనే ఉంచుకోండని చెప్పి తీసుకురావడానికి బయటకు వెళ్లిన గోపినాధ్‌రెడ్డి తదితరులు రాకపోవడంతో బయటకు వెళ్లి చూడగా ఎవరూ కానరాకపోవడంతో ముఠా సభ్యులు ఇచ్చి వెళ్లిన బ్యాగు తాళం పగులగొట్టి తెరచిచూడగా చిత్తుకాగితాలు ఉండడంతో వహీద్ ఈ నెల 5న ఒన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు. దర్యాప్తు ప్రారంభించి మధ్యవర్తి అన్వర్‌ను విచారించి డబ్బుతో పరారైన గోపినాధ్‌రెడ్డిని అరెస్టు చేశామన్నారు. విచారణ ఇంకా కొనసాగుతుందని, డబ్బు కూడ స్వాధీనం చేసుకుంటామని ఇన్స్‌పెక్టర్ తెలిపారు. దీని వెనుక ఉన్న వారిని త్వరలో అరెస్టు చేస్తామని అన్నారు.