తెలంగాణ

కాల్వలోకి దూసుకెళ్లిన బైక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంకిడి, డిసెంబర్ 20: దైవ దర్శనం చేసుకోవడానికి మహారాష్టల్రోని రాజురా వద్దగల జోగాపూర్ జాతరకు వెళ్ళి వస్తూ ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన కుమ్రంభీం జిల్లా వాంకిడి మండలంలో జరిగింది. వాంకిడి మండలంలోని ఇందాని గ్రామానికి పక్కనే గల మహారాష్టల్రోని భారీ గ్రామానికి చెందిన నగోషే రాజ్‌కుమార్ (21), సెండే వసంత్ (23), మోహర్లె శ్రీకాంత్ (18) ఎంహెచ్34 ఎహెచ్7121 మోటర్ సైకిల్‌పై వాంకిడి వైపుగల అంతరాష్ట్ర రహాదారికి ఆనుకొని ఉన్న రాజురా వద్ద గల జోగపూర్‌లోని జాతారకు వెళ్ళువసూత వాంకిడిలో ఆగి మద్యం తాగారు. తిరిగి స్వగ్రామం భారీకి పోవడానికి రాత్రి 8.30 గంటలకు బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళగానే తాగిన మైకంలో వాహనం అదుపు తప్పి సరాండి గ్రామం వద్ద గల కుమరం భీం ప్రధాన కాల్వలోకి దూసుకెళ్ళింది.
ఈ సంఘటనలో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో సెండే వసంత్ (23), మోహర్లె శ్రీకాంత్ (18) అక్కడికక్కడే చనిపోగా, రాజ్‌కుమార్ కాల్వగట్టుపై నుండి ఎగిరి పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వారి వద్ద లభించిన ఐడి కార్డుల ఆధారంగా వారి కుంటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వారిద్దరిని కుమరంభీ ఆసిఫాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించి శవ పరిక్షల అనంతరం అప్పచెప్పి, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వాంకిడి సిఐ ప్రసాద్, ఎస్‌ఐ రాజు పేర్కొన్నారు.
మూల మలుపు మహా డేంజర్
వాంకిడి మండలంలోని సరాండి గుండా నిర్మించిన కుమరంభీం జలాశయం ప్రధాన కాల్వకు గల సరాండి మూలమలుపు ప్రమాదకరంగా మారింది. ఇక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులేకపోవడంతోపాటు, అకస్మత్తుగా మూల మలుపు ఉండడంతో ఇక్కడ రాత్రిపూట తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు వెంటనే రేడియం బోర్డు పెట్టాలని మండల వాసులు కోరుతున్నారు.

చిత్రాలు..కాల్వలో పడిన యువకులను బయటకు తీస్తున్న పోలీసులు.