తెలంగాణ

అవినీతి భగీరథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: మిషన్ భగీరథ పథకంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ఆరోపణపై అధికార విపక్షాల మధ్య మంగళవారం అసెంబ్లీలో తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. మిషన్ భగీరథపై లఘచర్చ ముగింపులో మంత్రి కెటిఆర్ సమాధానం ఇవ్వటానికి పూనుకున్నప్పుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర స్వరంతో ఇంటెక్ వెల్ కాంట్రాక్టుల్లో అవినీతి జరిగిందని, ఫైళ్లు స్పీకర్ వద్ద పెడితే అవినీతిని నిరూపిస్తానని సవాల్ చేశారు. దీనిపై కెటిఆర్ స్పందిస్తూ ఆధారాలు ఉంటే స్పీకర్‌కు ఇవ్వండని లేదా కోర్టుల్లాంటి ఇతర వేదికల్లోనైనా నిరూపించండని ప్రతిసవాలు విసిరారు. ‘ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడతాం వినండి అంటే కుదరదు, పరువు నష్టం దావా వేస్తామ’ని హెచ్చరించారు. ఇంటెక్ వెల్ పనులకు సంబంధించి 1800 కోట్ల రూపాయల పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడంలో అక్రమాలకు పాల్పడ్డారని, దీనిని తాను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని, దీనిపై సభా సంఘం వేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ హయాంలో సిపిసి విధానంలో కాంట్రాక్టులు ఇచ్చారని, మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చారని కెటిఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల విధానానికి స్వస్తి పలికినట్టు, ఈపిసి విధానాన్ని తొలగించినట్టు చెప్పారు. మిషన్ కాకతీయలో అంతా ఆంధ్రా కాంట్రాక్టర్లకే పనులు అప్పగించారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై కెటిఆర్ స్పందిస్తూ, కాంగ్రెస్ హయాంలోనే ఆంధ్రా కాంట్రాక్టర్లకు అవకాశాలు కల్పించారని, ఒక్క తెలంగాణ కాంట్రాక్టర్ కూడా ఎదగకుండా చేశారని ఆరోపించారు. గత పాలకుల హయాంలో ఈ కాంట్రాక్టర్లకు భారీ పనులు అప్పగించారని, దీని వల్ల ఏ రాష్ట్రంలోనైనా కాంట్రాక్టులు పొందే విధంగా వీరు అర్హతలు సాధించారని అన్నారు. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో సైతం వీళ్లు కాంట్రాక్టులు చేపడుతున్నారని, వారికి ఈ అవకాశం కల్పించింది గత పాలకులే అని కెటిఆర్ విమర్శించారు. మిషన్ భగీరథకు 42వేల కోట్లు అవసరమా? అని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్క చిత్తూరు జిల్లాలో తాగునీటి పథకానికి ఏడువేల కోట్లు మంజూరు చేస్తే ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. ఒక్క జిల్లాకు ఏడువేల కోట్లు అయితే పది జిల్లాలకు ఎంత కావాలని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాలో రెండు లక్షల మంది ఫ్లోరోసిస్ వ్యాధి గ్రస్తులని, మానవ రహిత జిల్లాగా మారుతుందని హెచ్చరికలు చేశారని చెప్పారు. ఆదిలాబాద్‌లో గిరిజనులు బురదనీటిని తాగే పరిస్థితి ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల కోసం రాజకీయ నాయకుడు ఆలోచిస్తాడు, భవిష్యత్తు కోసం దార్శనికుడు ఆలోచిస్తారు. తెలంగాణ భవిష్యత్తును అద్భుతంగా తీర్చి దిద్దడానికి కెసిఆర్ దార్శనికుడు అని మంత్రి తెలిపారు.