తెలంగాణ

చంపేస్తున్న చలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,డిసెంబర్ 21: ఉత్తరాది నుండి వీస్తున్న శీతలపవనాలతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు గజగజ వణుకుతున్నారు. మొన్నటివరకు ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల వరకు నమోదుకాగా గత రెండు రోజుల నుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలతోపాటు ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆదిలాబాద్‌లో బుధవారం 5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు నమోదైంది. ఉట్నూరు, ఆసిఫాబాద్, బోథ్ డివిజన్‌లలో 4.6 డిగ్రీలు నమోదు కావడం చలితీవ్రతకు అద్దంపడుతోంది. ఉదయం 6 గంటల నుండి 9 వరకు రాత్రి వేళల్లో 10 గంటల వరకు ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పాఠశాల చిన్నారులు ఉదయం 9 గంటలకు ఎముకలు కొరికే చలిలో స్కూలుకు వెళ్లాలంటేనే నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పైగా ఉదయం దట్టమైన పొగమంచు కప్పివేయడంతో పట్టణాలు, పల్లెల్లో జనజీవనం స్థంభించిపోతోంది. గ్రామాల నుండి పట్టణాలకు నిత్యం రాకపోకలు సాగించే కూరగాయలు, పాల రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. రాత్రి 7 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతుండగా ఎక్కడ చూసినా పల్లెల్లో చలి మంటలు వేసుకొని రక్షణ పొందుతున్నారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లలో యాచకుల పరిస్థితి ముఖ్యంగా వృద్దుల పరిస్థితి కడుదయనీయాంగా మారుతోంది. చలి దాటికి తట్టుకోలేక జనం ఉక్కిరిబిక్కిరి లోనవుతుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో, గ్రామాల్లో చర్మవ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు పిల్లలను, పెద్దలను పట్టిపీడిస్తున్నాయి. మరో వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పడిపోయి చలిగాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. విదర్భ నుండి వీస్తున్న శీతలపవనాల కారణంగానే చలితీవ్రత అమాంతం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు నానా అవస్థలకు గురవుతున్నారు. చలినుండి రక్షణ పొందేందుకు సరిపడ దుప్పట్లు లేకపోవడం, మరోవైపు గిరిజన ఆశ్రమ వసతి గృహాల్లో ఏర్పాటు చేసిన గీజర్లు పనిచేయకపోవడంతో చన్నీటి స్నానాలు చేసి పిల్లలు వణికిపోతున్నారు. పైగా వసతి గృహాలకు కిటికీలు లేకపోవడంతో రాత్రి వేళల్లో విద్యార్థుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.