తెలంగాణ

రుణమాఫీ పరిపూర్ణం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: తెలంగాణలో రైతులకు రుణమాఫీని పరిపూర్ణం చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేర్కొన్నారు. రైతు రుణమాఫీని నాలుగు విడతల్లో పూర్తి చేయాలనేది ఒక విధానంగా తీసుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. శాసనసభలో బుధవారం వ్యవసాయంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ కాంగ్రెస్ వారికి అనేక డిమాండ్లు ఉంటాయని వాటన్నింటినీ తాము తీర్చాల్సిన పనే్లదని, తమకు రైతుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉందని పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిందని, రానున్న రోజుల్లో ఆదాయం తగ్గే ప్రమాదం ఉందని, ఈ దశలో అన్నీ ఒకే మారు చేయడం సాధ్యం కాదని సిఎం అన్నారు. నాలుగు విడతల రుణ మాఫీ అనంతరం తాను సమీక్షిస్తానని, అలాగే మంత్రులు సైతం బ్యాంకర్లతో సమీక్షిస్తారని, ఎక్కడైనా ఎలాంటి సమస్య ఎదురైనా వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. బ్యాంకుల పొరపాటుతో రైతులకు వడ్డీ భారం పడితే బ్యాంకుల తప్పునకు ప్రభుత్వమే మూల్యం చెల్లించనుందని, తామే ఆ భారాన్ని భరిస్తామని చెప్పారు.
రెండు నెలల్లో పూర్తిచేస్తాం: ఈటల
రెండు నెలల్లో రుణమాఫీ ప్రక్రియను పూర్తిగా అమలుచేసి తీరుతామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అసెంబ్లీలో వ్యవసాయంపై జరిగిన చర్చలో ఆయన జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం నాలుగవ, చివరి విడత రుణమాఫీ చేసి తీరుతుందని అన్నారు. గతంలో కొన్ని జిల్లాల్లో కొందరు మేనేజర్లు, బ్యాంకు అధికారులకు అవగాహన లేక రైతులు ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని అన్నారు. ఒకటి అరా సంఘటనలు జరిగినా విజయవంతంగా మూడు విడతలు పూర్తిచేశామని అన్నారు.
1194 మంది రైతుల ఆత్మహత్య
టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో 1194 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అయితే జీవో 421 ప్రకారం ఒక కమిటీ ఈ ఆత్మహత్యలను పరిశీలించి అందులో 469 మంది పరిహారానికి అర్హులని తేల్చిందని వారిలో ఇప్పటికే 176 మందికి పరిహారం అందించామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. తెలుగుదేశం హయాంలో 11604 మంది ఆత్మహత్య చేసుకున్నారని అయితే ఆనాడు కేవలం 1066 మందికి మాత్రమే పరిహారం అందిందని పేర్కొన్నారు.