తెలంగాణ

1.3 లక్షల కోట్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదీ 2016-17 తెలంగాణ బడ్జెట్

దాదాపు ఖరారైన వార్షిక ప్రణాళిక
సూత్రప్రాయంగా వెల్లడించిన కెసిఆర్
కేంద్రం విదిలింపులపై తీవ్ర అసంతృప్తి
ప్రభుత్వ యంత్రాంగంతో సమీక్ష
మార్చి 10నుంచి అసెంబ్లీ బడ్జెట్ భేటీ

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై పెట్టుకున్న ఆశలు వీగిపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా బడ్జెట్ పరిమాణాన్ని ఖరారు చేసుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.1.25 లక్షల నుంచి 1.3 లక్షల కోట్ల వరకు బడ్జెట్ ఉండబోతోందని సిఎం కె చంద్రశేఖర్ రావు సూచనప్రాయంగా అధికారవర్గాలకు వెల్లడించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి తిలకించారు. అనంతరం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల సలహాదారు జిఆర్ రెడ్డి, సిఎస్ రాజీవ్ శర్మ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి నవీన్ మిట్టల్, ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి బిపి ఆచార్య, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులతో సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యతలు, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై పడనున్న ప్రభావం, కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా, కేంద్రం నుంచి రాష్ట్రానికి రానున్న ఇతర గ్రాంట్లు తదితర అంశాలపై సిఎం చర్చించారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం రాష్ట్రానికి రానున్న నిధులపై ఒక అవగాహన ఏర్పడటంతో రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభుత్వం స్పష్టమైన అంచనాకు వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1.25 లక్షల నుంచి 1.3లక్షల కోట్ల వరకు బడ్జెట్ ఖరారు చేయాలని సిఎం కెసిఆర్ సూచనప్రాయంగా అధికారులకు వెల్లడించినట్టు అధికారవర్గాల సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, దళితులకు ఉచిత భూపంపిణీ, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులో సింహభాగం ఉండాలని అధికారులకు సిఎం మార్గనిర్దేశం చేసినట్టు ఈ వర్గాల సమాచారం. ఇటీవలే ఢిల్లీవెళ్లి జైట్లీని కలిసిన కెసిఆర్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలమేరకు బడ్జెట్‌లో తెలంగాణకు భారీగా నిధులు కేటాయించాలని కోరారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లు కార్యరూపం దాల్చకపోవడం పట్ల అధికారులు సహా సిఎం ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే కేంద్ర బడ్జెట్‌లో జరిగిన కేటాయింపులను ఏవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు అన్వయించుకోవాలనే అంశంపైనా చర్చి జరిగినట్టు తెలుస్తోంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 10నుంచి నెలాఖరు వరకు నిర్వహించాలని భావిస్తున్నట్టు కూడా సమావేశంలో సిఎం సూత్రప్రాయంగా వెల్లడించారని సమాచారం.