తెలంగాణ

పదవ షెడ్యూల్‌లో ఉర్దూ అకాడమీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: రాష్ట్ర విభజన జరిగి రెండున్నరేళ్లు అయినా నేటికీ ఉర్దూ అకాడమీని ఎందుకు విభజించలేదని గురువారం శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఇందుకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సమాధానం చెప్పాలని కోరారు. దీంతో ఉప ముఖ్యమంత్రి సమాధానం చెబుతుండగా, అందుకు షబ్బీర్ అలీ సంతృప్తి చెందకపోవటంతో మంత్రి టి.హరీశ్‌రావు జోక్యం చేసుకుని అకాడమీ విభజన అంశం రాష్ట్ర పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ పదిలో ఉందని, ఇందుకు కొంత సమయం పట్టే అవకాశాముందని వివరించారు. ఆ తర్వాత సభ్యులు నారదాసు లక్ష్మణ్‌రావు, రాములు నాయక్, డి.రాజేశ్వర్‌రావు, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కర్నె ప్రభాకర్, డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యవసాయ మార్కెట్ సంఘాలలో రిజర్వేషన్లు, రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమ అభివృద్ధి, వ్యవసాయ మార్కెట్‌యార్డుల్లో నగదు రహిత లావాదేవీలు అంశంపై అడిగిన ప్రశ్నలకు మంత్రులు హరీశ్‌రావు, పద్మారావు, పోచారం శ్రీనివాసరెడ్డిలు సమాధానం చెప్పారు. ఆ తర్వాత ‘వ్యవసాయ ఆధునీకరణ, రుణ మాఫీ, పెట్టుబడి రాయితీ చెల్లింపు’ అంశంపై లఘు చర్చను కొనసాగించారు. సభ్యుల ప్రశ్నలకు వ్యవసాయ మంత్రి సమాధానం చెప్పగా, అందుకు కాంగ్రెస్ సభ్యులు సంతృప్తి చెందలేదు.
రైతులను ఆదుకోవటంలో, వ్యవసాయాన్ని ప్రోత్సహించటంలో ప్రభుత్వం వారికి భరోసా ఇవ్వటంలో విఫలమైందని, మంత్రి సమాధానం స్పష్టంగా లేదని కాంగ్రెస్ సభ్యులు పి.సుధాకర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడిన తర్వాత చైర్మన్ స్వామిగౌడ్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.