తెలంగాణ

మూడు జిల్లా కేంద్రాలకు ఔటర్ రింగ్ రోడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: వరంగల్, మహబూబాబాద్, జనగాం జిల్లా కేంద్రాలకు ఔటర్ రింగ్‌రోడ్లు వేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డిపిఆర్) రూపొందించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. అసెంబ్లీ సమావేశం మందిరంలో గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మలనాగేశ్వరరావు, చందూలాల్, వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ మూడు జిల్లా కేంద్రాల నుండి రెండు జాతీయ రహదారులు వెళుతున్నాయని, వీటిని బైపాస్‌లుగా మార్చి ఔటర్ రింగ్‌రోడ్డులను వేయాల్సి ఉందన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు అలైన్లను మారిస్తే, రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుందన్నారు. తద్వారా ఓఆర్‌ఆర్ పనులు కూడా వేగంగా జరుగుతాయన్నారు. వరంగల్ జాతీయ రహదారి 163, వరంగల్ మీదుగా వెళ్లే జగిత్యాల-ఖమ్మం జాతీయ రహదారి, మహబూబాబాద్, మరిపెడ మీదుగా వెళ్లే భూపాలపల్లి-నర్సంపేట జాతీయ రహదారి, మహబూబాబాద్ మీదుగా వెళ్లే భద్రాచలం-వలిగొండ జాతీయ రహదారి, జనగాం మీదుగా వెళ్లే జాతీయ రహదారి 163, జనగాంమీదుగా వెళ్లే దుద్దెడ-సూర్యాపేట జాతీయ రహదారులను మూడు జిల్లా కేంద్రాల వద్ద ఔటర్ రింగ్‌రోడ్డులుగా మార్చవచ్చన్నారు. వచ్చే ఏడాది జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో గట్టమ్మ నుండి భూపాలపల్లి వెళ్లే నాలుగు కిలోమీటర్ల రోడ్డును నాలుగు వరుసల రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని శ్రీహరి ఆదేశించారు. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు పనులు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.

చిత్రం.. అసెంబ్లీ సమావేశ మందిరంలో గురువారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో
పాల్గొన్న మంత్రులు కడియం, తుమ్మల, చందూలాల్ తదితరులు