తెలంగాణ

రాష్ట్రంలో నిరంకుశ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: ప్రత్యేక రాష్ట్రం అవతరించిన తర్వాత తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతోందని శాసన మండలిలో కాంగ్రెస్ ఉప నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గురువారం శాసనమండలి నుంచి వాకౌట్ చేసిన తరువాత వారు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ సీమాంధ్రకు చెందిన పైప్‌ల కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేందుకే రూ. 45వేల కోట్లు అప్పు చేసి మిషన్ భగీరథను ప్రభుత్వం ప్రారంభించిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ కాలం గడుపుతోందే తప్ప ఏమాత్రం అభివృద్ధి చేపట్టలేకపోయిందన్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కన్నా సమైక్యాంధ్రలో కాంగ్రెస్ పాలనలో పరిస్థితులు కాస్త మెరుగ్గా ఉండేవని వాపోయారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయంలో వ్యసాయాభివృద్ధి, రైతులను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 8లక్షల ఎకరాలకు సాగునీరును అందించిందని వివరించారు. అప్పట్లో ప్రారంభించిన నాలుగు నీటి పారుదల ప్రాజెక్టుల పనులు 95 శాతం పూర్తయ్యాయని, ఇపుడు కేవలం రూ. 300 కోట్ల నుంచి 400 కోట్ల వరకు వెచ్చిస్తే పూర్తయి, రైతులకు పుష్కలంగా నీరు అందుబాటులోకి వస్తాయని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తరపున రైతులకు చెందాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇవ్వడం లేదని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. వృద్ధులకు పెన్షన్ సకాలంలో అందట్లేదని ఆరోపించారు. వ్యవసాయాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఒక్కరైతు కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని విమర్శించారు.