తెలంగాణ

విద్యుత్ డిమాండ్ ఎంతయినా తట్టుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: తెలంగాణలో రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ 9500 మెగావాట్లకు చేరుకున్నా సరఫరా చేసే పరిస్థితికి విద్యుత్ సంస్థలు చేరుకున్నాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీప్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9న 8284 మెగావాట్ల డిమాండ్‌ను కూడా తట్టుకుని నిలబడ్డామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేలు అందించేందుకు ఒక మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేశామన్నారు. బిల్లు మొత్తాన్ని తీసుకోవడం, బిల్లింగ్, బిల్లు చెల్లింపు,్ఫర్యాదులను దాఖలు చేయడం, నూతన సేవల పరిస్థితి, ఇంధన పొదుపువివరాలపై ఈ యాప్ ద్వారా సేవలు అందిస్తామన్నారు.
వ్యవసాయం, ఇతర సబ్సిడీ కేటగిరీలకు ఉచిత విద్యుత్ కోసం రాష్ట్రప్రభుత్వం 2016-17లో రూ. 4584.50 కోట్ల నిధులను డిస్కాంలకు ఇస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ అంతరాయాలను పర్యవేక్షించేందుకు నియంత్రణ, సమాచార సేకరణ కేంద్రాన్ని ప్రారంభించి హైదరాబాద్‌లో 228 సబ్‌స్టేషన్లలో 25 సబ్‌స్టేషన్లను ఏకీకృతం చేశామన్నారు. మిగిలిన వాటిని ఆరు నెలలలోపు ఏకీకృతం చేస్తామన్నారు. వచ్చే మూడేళ్లలో రూ. 42 వేల కోట్లతో 18 వరకు 400 కెవి సబ్‌స్టేషన్లు, 34 వరకు 220 కెవి సబ్‌స్టేషన్లు, 90 వరకు 132 కెవి సబ్‌స్టేషన్లు, 937 33/11 కెవి సబ్‌స్టేషన్లను, విద్యుత్ పంపిణీ, లైన్లతో అనుసంధానం చేసి నెట్‌వర్క్‌ను పటిష్ఠం చేయనున్నట్లు చెప్పారు. మణుగూరు, కొత్తగూడెం, దామరచర్ల వద్ద రూ. 37,600 కోట్లతో 5880 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టులను జెన్కో ఆధ్వర్యంలో నిర్మిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో వ్యవసాయంలో పెరుగుతున్న డిమాండ్‌ను 6989 ఎంవి ట్రాన్స్‌మిషన్ సామర్థ్యాన్ని 132 కెవి, 220 కెవి స్థాయిలో పెంచామన్నారు. రాష్ట్రంలో రెండు డిస్కాంలలో 1.31 కోట్ల మంది వినియోగదారులున్నారని, 21 లక్షల వ్యవసాయ వినియోగదారులు దాదాపు 25 శాతం ఇంధనాన్ని వినియోగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌ను పటిష్ఠం చేసేందుకు రూ.2394 కోట్లను పెట్టుబడులు పెట్టామన్నారు. విద్యుత్ పంపిణీ నష్టాలను 16.83 శాతం నుంచి 15.98 శాతానికి తగ్గించామన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లో 2700 మెగావాట్ల కొరత ఉండేదని, ఈ రోజు విద్యుత్ సమస్యలు లేవన్నారు.