తెలంగాణ

ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడ, డిసెంబర్ 25: ఈత సరదా ఇద్దరు చిన్నారులు ప్రాణాలు తీసింది. చెరువులో విరబూసిన కమలం పువ్వును కోసేందుకు నీటిలో దిగి, ఈతకొడుతూ వెళ్లి నీట మునిగిపోవడంతో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం, ఎదుళ్లపల్లి గ్రామంలోని ఎన్నం చెరువులో ఆదివారం జరిగిన ఈ సంఘటన విషాదాన్ని మిగిల్చింది.
ఎదుళ్లపల్లికి చెందిన కాడబోయిన జంపయ్య, మంజుల దంపతుల రెండవ కుమారుడు శ్రీచరణ్‌తోపాటు కమ్మాల సింహాద్రి, యాకమ్మ దంపతుల మూడవ కుమారుడు శివ ఎన్నంచెరువువద్దకు ఈత కొట్టేందుకు వెళ్లారు. వారితోపాటు మరో బాలుడు ముకుంద్‌కూడా చెరువువద్దకు వెళ్లాడు. వారంతా ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నారు. ఆదివారం క్రిస్మస్ సెలవుకావడంతో వీరంతా చెరువువద్ద ఆడుకునేందుకు వెళ్లారు. చెరువులో ఉన్న కమలం పువ్వును కోసేందుకు మొదట శ్రీచరణ్, శివ నీటిలో దూకారు. వాళ్లు మునిగిపోతూండటం చూసిన ముకుంద్ కేకలు వేయడంతో పక్కనే వ్యవసాయ పనులు నిర్వర్తిస్తున్న స్థానికులు గమనించి చెరువువద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆ ఇద్దరు బాలలు నీట మునిగిపోయారు. గ్రామస్థులు నీటిలో వెదకగా కొద్దిసేపటి తరువాత ఆ ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారి ఇళ్లకు తరలించారు. శ్రీచరణ్, శివల మృతితో ఎదుళ్ళపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

చిత్రం..మృతులు శ్రీచరణ్, శివ